భారీగా ఆస్తులు కూడబెట్టిన సమంత
ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది సమంత. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 14 సంవత్సరాల కెరీర్ ను పూర్తిచేసుకుంది. నాగచైతన్యతో ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం.. తర్వాత విడిపోవడం అనేది సాధారణంగా జరిగిపోయాయి. మయోసైటిస్ తో బాధపడుతుంటే చికిత్స కోసం ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించింది. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది.
2010లో కెరీర్ ప్రారంభించిన సమంత ఇప్పటివరకు రూ.120 కోట్ల ఆస్తులను కూడగట్టినట్లు తెలుస్తోంది. నిన్న సమంత పుట్టినరోజు కావడంతో ఆమెకు సంబంధించిన విషయాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో ఒకటి సమంత ఆస్తుల విషయం. వాటి వివరాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువ ఆసక్తి కనపరిచారు. హీరోయిన్ గా పారితోషికంతోపాటు వాణిజ్య ప్రకటనలు, వ్యాపారాలద్వారా ఇంత ఆస్తిని పోగేసింది. సినిమాకు రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు తీసుకుంటోంది. తన పారితోషికాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెడుతోంది.

అలాగే ఫ్యాషన్ రంగంలోను సొంత లేబుల్ తో ముందుకు సాగుతోంది. కార్లు అంటే సామ్ కు మహా పిచ్చి. రూ. 3.30 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ జి63 ఎఎమ్‌జి, రూ. 2.26 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, రూ. 1.46 కోట్ల విలువైన పోర్షే కేమాన్ జిటిఎస్, రూ. 72 లక్షల జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, రూ. 87 లక్షల ఆడి కార్లు సొంతం చేసుకుంది. రూ. 1.70 కోట్లకు బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారును కొనుగోలు చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన ఇంటిలో నివసిస్తోంది. దీని విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే ముంబయిలో రూ.15 కోట్ల విలువైన 3BHK సీఫేసింగ్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసింది. చెన్నై, బెంగళూరు సహా మరికొన్ని ప్రాంతాల్లో ఫ్లాట్లు ఉన్నాయి.
లక్షల రూపాయల విలువ చేసే లూయిస్ విట్టన్, గూచీ .. చానెల్ వంటి హై-ఎండ్ బ్రాండ్‌లకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తుంది. ఖరీదైన వాచ్ లు, ఆభరణాలను కూడా సొంతం చేసుకుంది. తన సొంత ఫ్యాషన్ లేబుల్ సాకిని 2020లో ప్రారంభించింది. సస్టైన్‌కార్ట్ మార్కెట్‌ప్లేస్ ఇండియా సంస్థలో పెట్టుబడితో ఇ-కామర్స్‌లోకి కూడా ప్రవేశించింది. సొంతంగా బ్యానర్ ని స్థాపించి ఇందులో బంగారం అనే సినిమాని ప్రారంభించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications