రూ. 100 కోట్ల నుంచి కోటి రూపాయిలకు పడిపోయిన తెలుగు హీరో
సక్సెస్ ఉంటేనే ఎవరైనా పక్కన ఉంటారు. సక్సెస్ లేకపోతే ఎవరూ కూడా అటువైపు కూడా చూడరు. ముఖ్యంగా సిని ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే రేసులో నిలబడతారు.సక్సెస్ ఉంటేనే దర్శక, నిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు. అది హీరో అయినా, హీరోయిన్ అయినా ,సక్సెస్ ఉంటేనే సినిమా రంగంలో రాణించగలుగుతారు. అయితే ఓ తెలుగు యంగ్ హీరో తన సినిమాతో ఏకంగా రూ.100 కోట్లకుపైగానే కలెక్షన్స్ సాధించారు. దీంతో ఆ యంగ్ హీరోల్లోనే టాప్‌గా నిలిచాడు. కట్ చేస్తే అదే హీరో వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతున్నారు. ఆ హీరో మరెవ్వరో కాదు..నిఖిల్.
2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన "హ్యాపీ డేస్" చిత్రంలో రాజేష్ పాత్రలో నటించాడు. ఈ చిత్రం అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అతను అనేక విజయవంతమైన చిత్రాలలో నటించాడు. వాటిలో "యువత", "స్వామి రారా", "కార్తికేయ", "సూర్య వర్సెస్ సూర్య", "ఎక్కడికి పోతావు చిన్నవాడా", "కేశవ", "కిరాక్ పార్టీ", "అర్జున్ సురవరం", "కార్తికేయ 2" మరియు "18 పేజెస్" వంటి చిత్రాలు ఉన్నాయి.

నిఖిల్ తన కెరీర్‌లో అనేక అవార్డులను అందుకున్నాడు. అతను రెండుసార్లు నంది అవార్డును గెలుచుకున్నాడు.ఇక నిఖిల్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. ముఖ్యంగా "కార్తికేయ 2" సినిమాతో మనోడి క్రేజ్ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా కాదు డిజాస్టర్‌లుగా మారాయి. స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి.
ముఖ్యంగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా అయితే ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. ఈ సినిమా కోటి రూపాయిలు కూడా కలెక్షన్లు సాధించలేకపోయిందంటే నిఖిల్ సినిమాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.స్వయంభు, కార్తికేయ 3 సినిమాలతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మరి ఈ సినిమాలతో అయిన నిఖిల్ బౌన్స్‌బ్యాక్ అవుతాడేమో చూడాలి.












Click it and Unblock the Notifications