అందరిముందే హీరోయిన్ కు 'పులిహోర' కలిపేశాడు!
కొంతమందికి స్క్రీన్ పై కనిపించాలని, ఫేమస్ అవ్వాలని అనిపిస్తుంటుంది. అలా అనుకునేవారికి స్టేజీమీద ఓ క్రేజీ హీరోయిన్ కనిపిస్తే ఎలా ఉంటుంది? పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తుంటారు. ఈ మధ్య సినిమాలకు సంబంధించిన ప్రెస్ మీట్స్ జరుగుతున్నప్పుడు కొంతమంది అడుగుతున్న ప్రశ్నలు కానీ, హీరోయిన్లకు వారు వేస్తున్న ప్రశ్నలుకానీ, కలిపే పులిహోర చూస్తుంటే పిచ్చి ఎంత ముదిరిపోయిందో చెప్పాల్సిన అవసరంలేదు.
ప్రేమలు బ్యూటీ మమిత బైజుకి స్టేజ్ మీద ఓ యూట్యూబర్ హారతి ఇవ్వడమేకాదు.. స్టేజ్ మీద ఆమెను విపరీతంగా పొగిడేశాడు. క్రష్ అంటూ.. క్యూట్ నెస్ ఓవర్ లెడెడ్ అంటూ.. ఇలా ఏదేదో మాట్లాడాడు. తన నోటికి వచ్చిన పొగడ్తలన్నీ కురిపించడమేకాదు పులిహోర చేష్టలన్నీ చూపించాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎవడురా వీడు.. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు.. అంతా సెట్ చేసి పెట్టుకున్నావా ఏమిటి? ఎవడురా నువ్వు ముందుగానే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నావా? అంటూ అడుగుతున్నారు.

స్టేజ్ మీదకు హారతి సెటప్ ఎలా వచ్చిందిరా నాయనా.. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు.. ఎక్స్ ట్రాలు తగ్గించుకుంటే మంచిదంటూ దారుణంగా ఏకిపారేస్తున్నారు. తెలుగు మీడియా ఇంతలా దిగజారిపోయిందా ఏమిటి? జర్నలిస్టులు ఇలా తయారయ్యారేంట్రా బాబూ అంటూ నెటిజన్లే కాకుండా సినీ ప్రియులు కూడా మండిపడుతున్నారు. ప్రెస్ మీట్లకు వచ్చే బ్యాచ్ లో కొంత వార్తలు రాసే బ్యాచ్ కాదని చాలామందికి తెలియదంటున్నారు. యూట్యూబ్, మీమర్స్ బ్యాచ్ చేసే ఇలాంటి పనులవల్ల మంచి ప్రశ్నలు అడిగి, వార్తను బాగా కవర్ చేసే జర్నలిస్టులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇలా చేయడం కూడా ఒక ప్లాన్ అని, సినిమా టీం, పీఆర్ టీం కావాలనే చేస్తోందంటున్నారు. ఇలాంటివి ప్రమోషనల్ స్టంట్ అని, అందరూ లైట్ తీసుకోవాలని నెటిజన్లు అంటున్నారు. అయితే భవిష్యత్తులో కూడా ఇంకెన్ని పిచ్చి వేషాలు చూడాల్సి వస్తుందో.. స్టేజ్ మీద ఇంకెంత దారుణంగా ప్రవర్తిస్తారో అంటున్నారు.












Click it and Unblock the Notifications