తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్ తో వస్తున్న క్రేజీ మూవీ..!
తెలుగు సినిమా టైటిల్స్ లో కొత్త కొత్త ట్రెండ్స్ కొనసాగుతూ వస్తున్నాయి. చాలా మంది తమ సినిమాకు క్యాచీ టైటిల్స్, తక్కువ అక్షరాలతో షార్ట్ టైటిల్స్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అప్పట్లో తిట్లతో టైటిల్స్ పెట్టేవారు.. ఇప్పుడు తెలుగు సినిమాలకు డైరెక్ట్ గా ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా పెరిగిపోతున్న క్రమంలో అన్ని భాషలకూ అర్థమయ్యేలా కామన్ గా ఇంగ్లీష్, లేదా హిందీ టైటిల్స్ కూడా పెడుతున్నారు. అయితే తాజాగా ఓ తెలుగు సినిమాకు పెట్టిన టైటిల్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్ పెట్టారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఇంత పెద్ద టైటిల్ లేదనే చెప్పాలి. వెరైటీగా, అత్యంత పొడవైన టైటిల్ తో దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ కొత్త చిత్రం వివరాలను వెల్లడించారు.
ఈ మూవీకి 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు' అనే టైటిల్ పెట్టారు. ఇది టాలీవుడ్ లోనే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే అతిపెద్ద టైటిల్ అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 18 న విడుదల కానుంది. 'అప్పుడప్పుడూ', 'ఆ నలుగురు', 'మధుమాసం', 'అందరి బంధువయా', 'ఇదీ సంగతి', 'ఆటగదరా శివ' ఇలా విభిన్నమైన సినిమాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత అంటే దాదాపు 8 ఏళ్ల తర్వాత చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడంతో మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

గతంలో 'మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు' అనే సినిమా టైటిల్, తెలుగులో సుదీర్ఘమైన టైటిల్ గా ఉండేది. ఇప్పుడు చంద్ర సిద్ధార్థ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఈ మూవీతో హర్ష అనే కొత్త కుర్రాడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేషా నిరోషా వంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీని సెప్టెంబర్ 18 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications