దసరా విలన్ టామ్ చాకో కుటుంబంలో ఘోర విషాదం..

ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆయన తండ్రి సి.పి. చాకో ప్రాణాలు కోల్పోగా.. టామ్ చాకోతో పాటు ఆయన తల్లి తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగిందని చెబుతున్నారు. షైన్ టామ్ చాకో తన తల్లిదండ్రులు, సోదరుడు, డ్రైవర్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. తమిళనాడులోని ధర్మపురి సమీపంలోని సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై వారి వాహనం ప్రమాదానికి గురైంది. కారు అకస్మాత్తుగా అదుపుతప్పి, ముందు వెళ్తున్న లారీని వెనక నుండి బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దాంతో వాహనం పూర్తిగా దెబ్బతిన్నట్టు కనబడుతోంది.

terrible-tragedy-happened-in-family-of-dussehra-villain-tom-chacko

స్థానిక ప్రజలు ప్రమాదాన్ని గమనించి వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వాహనంలో ఉన్న ఐదుగురిలో నటుడు షైన్ టామ్ చాకో తండ్రి సి.పి. చాకో తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. షైన్ టామ్ చాకూ, ఆయన తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ విషాదకర ఘటనపై మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, సహనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షైన్ టామ్ చాకో కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన తల్లి, షైన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+