"మీ ఇద్దరి కెమిస్ట్రీ.. ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి"

'కోర్ట్' మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన జంట హర్ష్ రోషన్- శ్రీదేవి. వీరిద్దరి కాంబోలో వస్తున్న మరో క్రేజీ మూవీ 'బ్యాండ్ మేళం'.. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు యూత్ లో విపరీతమైన అంచనాలను పెంచేశాయి. దాంతోపాటు తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ మొత్తం ఫుల్ కామెడీగా.. సరదాగా సాగిపోయింది. ఇక ఈ మూవీ మార్చి 13న గ్రాండ్ గా విడుదల కానుంది.

అయితే తాజాగా ఈ మూవీ ప్రొమోషన్స్ లో టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. హర్ష్ రోషన్- శ్రీదేవి జంటపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. "మీ ఇద్దరి కెమిస్ట్రీ.. ఫిజిక్స్ అవ్వగుండా చూసుకోండని తమన్ అన్నారు. అంటే గొడవలు రాకుండా చూసుకోండి అని.. కొట్టుకోవద్దండి లైఫ్ లో.. ఎందుకంటే మీరు కచ్చితంగా లైఫ్ లో చాలా దూరం ప్రయాణిస్తారు" అని తమన్ తెలిపారు. దాంతో స్టేజీ ఎదురుగా ఉన్న ఆడియన్స్ విజిల్స్ , కేరింతలు కొట్టారు. అప్పుడు తమన్.. "వేరేలా అనుకోకండ్రా.. నేను చదువుకోలేదు.. ఫిఫ్త్ ఫెయిల్.. నాకు జువాలజీ కానీ ఏ లాజీ కానీ తెలియదు" అని ఫన్నీగా మాట్లాడారు. దాంతో అక్కడున్న మూవీ టీమ్ తో పాటు ప్రేక్షకులు నవ్వుకున్నారు.

Thaman Fun Punch band melam Harsh-Sridevi Pair s Chemistry So Good Don t Turn It Into Physics

ఇక ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన 'తిప్పుకుంటాన్నవ్' అనే సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే 'బ్యాండ్ మేళం' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. మార్చి 13వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించారు. కాగా విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ఇది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+