పవన్ 'ఓజీ"లో అకీరా నందన్ ఎంట్రీ పక్కా.. సీక్రెట్ రివీల్ !!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న "ఓజీ" మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.
స్టార్ క్యాస్ట్ - మాస్ మ్యూజిక్
ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి పెంచాయి.

అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కనిపించబోతున్నాడనే రూమర్స్ జోరుగా వినిపించాయి. పవన్ ఎక్కడికి వెళ్లినా అకీరా వెంటనే కనిపించడం, ముఖ్యంగా రాజకీయ ఈవెంట్స్‌లో తండ్రి పక్కన నిలబడడం చూసి ఫ్యాన్స్ అతడి సినీ ఎంట్రీ సమయం దగ్గరపడిందని అనుకున్నారు. అంతేకాకుండా "ఓజీ"లో యంగ్ లుక్‌లో పవన్‌తో పాటు అకీరా కూడా స్క్రీన్‌పై కనిపిస్తాడనే ప్రచారం బలంగా సాగింది.
సీక్రెట్ రివీల్
లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెద్ద సీక్రెట్ బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. అకీరాలో మంచి టాలెంట్ ఉంది. భవిష్యత్తులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. అతని మ్యూజిషియన్ సెన్స్‌ను నేను చూశాను. 'ఓజీ' కోసం మనిద్దరం కలిసి వర్క్ చేద్దాం అనుకున్నాం. అకీరా కూడా ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో అతడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో వర్క్ చేశాడు. చాలా అద్భుతంగా వచ్చింది. తన తండ్రి సినిమాకే వర్క్ చేయడం అతనికి గర్వంగా అనిపించింది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పారు.

మరోవైపు ఈ సినిమాకి సాహోతో లింకు ఉందని కూడా టాక్ నడుస్తోంది. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ కటానా పట్టుకుని ఉన్న ఒక షాట్‌లో కనిపించిన గుర్తు.. 'సాహో'లోని వాజీ సిటీ చిహ్నాన్ని పోలి ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
అలానే బస్సు దిగుతూ బూట్లు ధరించిన ఒక రహస్య వ్యక్తి షాట్ కనిపిస్తుంది. అవి 'సాహో'లో ప్రభాస్ బూట్లలో కనిపించిన షాట్‌ను పోలి ఉందని కూడా పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా ఒక షాట్లో వాజి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ అనే బోర్డు షిప్ యార్డ్ కంటైనర్ మీద ఉంటుంది. దీంతో రెండింటికి లింక్ ఉందని.. ఇది సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అని ఫిక్స్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications