వచ్చి నేర్పించు.. అడ్రస్ పంపు బే.. నెటిజన్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ !
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నారు ఎస్.ఎస్. తమన్. వరుస విజయాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'అఖండ 2'.. పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు తమన్. తన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు, పర్సనల్ లైఫ్ గురించి కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తనపై తరచూ కాపీ ఆరోపణలు వచ్చినా, ట్రోలింగ్ జరిగినా కూడా ఏం పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఇప్పుడు ఓ అభిమానికి అనూహ్యంగా షాకింగ్ రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

సంగీతం పట్ల తమన్‌కు ఉన్న ప్రేమతో పాటు క్రికెట్‌పైనా ఆయనకు అంతే మక్కువ ఉంది. తన రోజు క్రికెట్ ఆడకుండా పూర్తికాదని చెప్పిన ఆయన, సీసీఎల్ లీగ్‌లో తెలుగు వారియర్స్ టీమ్‌కు కీలక ప్లేయర్‌గా కనిపించారు. ఈ క్రమంలోనే క్రికెట్‌కు సంబంధించిన ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన తమన్, "Don't bowl short ball bro" అనే క్యాప్షన్ జత చేశారు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
కానీ ఓ నెటిజన్ "షార్ట్‌కు, స్లాట్‌కు తేడా తెలియనప్పుడే నువ్వు ధోని ఫ్యాన్ అని అర్థమైంది" అంటూ కామెంట్ చేశాడు. అందుకు తమన్ - "ఒకే రా, వచ్చి నేర్చుకుంటా. అడ్రస్ పంపు బే" అంటూ సరదాగానే స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చారు. సాలిడ్ గా కౌంటర్ ఇవ్వడం పట్ల నెటిజన్లు సైతం రియాక్ట్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.
Ok Ra Vachiii nerchukunntaaa adresss pammpu bae ! https://t.co/B0M6AGbnO7
— thaman S (@MusicThaman) June 25, 2025
బాలయ్య నటించిన అఖండ, డాకు మహరాజ్ సినిమాలతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు తమన్. ఇక రీసెంట్ గానే తమన్‌కు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. ఖరీదైన పోర్షా కయెన్ కారును బహుమతిగా అందజేశారు. తమన్ తనకు తమ్ముడితో సమానమని బాలయ్య చెప్పుకొచ్చారు. అలాగే వరుసగా 4 హిట్లు ఇచ్చినందుకు ప్రేమతోనే కారు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు. వీరిద్దరి కాంబినేషన్ లో అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు వచ్చాయి. ఆ కారు విలువ సుమారు రూ.2 కోట్లు వరకు ఉంటుందని అంటున్నారు.
-
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
రూ.10 కోట్లు బడ్జెట్.. 10 రోజుల్లోనే 160 కోట్లకు పైగా కలెక్షన్స్ !!












Click it and Unblock the Notifications