ఆ డైరెక్టర్ నాతో పిల్లల్ని కనాలని ఉందన్నాడు.. నటి ఆరోపణ..
మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఇటీవల సినీ ఇండస్ట్రీలోనే తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ నివేదిక వచ్చినప్పటి నుంచి పలువురు నటులు మీడియా ముందుకు వచ్చి గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మలయాళ సినీ నటులపై కేసులూ కూడా ఫైల్ చేశారు. తాజాగా మరో నటి తమిళ పరిశ్రమలోనూ మహిళలపై లైంగిక వేధింపులు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. ఆమె ఎవరో కాదు. అప్పటి మలయాళం నటి సౌమ్య ..
తమిళ పరిశ్రమలోనూ లైంగిక వేధింపులు ఉన్నాయంటూ ఓ నటి ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఒక దర్శకుడు తనపై లైంగికంగా వేధించాడంటూ నటి సౌమ్య ఆరోపించింది. ఇటీవలే ఆమె ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ ఇండస్ట్రీలోని సంచలన విషయాలను బయటపెట్టారు. తనకు 18 ఏళ్ల వయసున్నప్పుడు ఓ డైరెక్టర్ తనను ఓ శృంగార బానిసలా వాడుకున్నాడని ఆమె పేర్కొన్నారు. ''నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆ దర్శకుడు తన భార్యతో కలిసి మా ఇంటికి వచ్చాడు. నన్ను కన్న తండ్రిలా చూసుకుంటా అని చెప్పాడు. కానీ ఆ తర్వాత నాతో పిల్లలు కనాలని ఉందన్నాడు '' అని నటి సౌమ్య వెల్లడించారు. కేరళ ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బృందానికి ఆ దర్శకుని గురించి పూర్తివివరాలు చెబుతానని నటి సౌమ్య అన్నారు.

"కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు 18 ఏళ్ల వయసులోనే నాకు తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే, అప్పుడు మా తల్లిదండ్రులకు సినిమా గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ చిత్ర దర్శకుడు మా వారిని ఒప్పించి సినీరంగంలోకి తీసుకెళ్లాడు" అంటూ నటి సౌమ్య చెప్పుకొచ్చారు.
నన్ను ఓ శృంగార బొమ్మ చేశాడు..
" షూటింగ్ కోసమని తరచుగా ఆ డైరెక్టరు తన ఇంటికి తీసుకెళ్లేవారు. కానీ ఆ దర్శకుడు నాతో మాట్లాడిన ప్రతిసారి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఓరోజు ఆ డైరెక్టర్ ఇంట్లో తన భార్య లేనప్పుడు నాకు ముద్దు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా నేను షాక్‌కు గురయ్యాను. నేనేమైనా తప్పు చేశానా? అనే భావన నాలో కలిగింది. కానీ నన్ను తన కూతురిగా భావిస్తున్నానని చెబుతూనే నాతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. బలవంతంగా నన్ను శారీరకంగా హింసించేవాడు. కన్న కూతురిలా చూసుకుంటా అంటూనే నాతో పిల్లల్ని కనాలని ఉందనేవాడు. నాపై లెక్కలేనన్ని సార్లు లైంగికంగా అనుభవించాడు. సుమారు ఓ సంవత్సరం పాటు నన్ను ఓ శృంగార బానిసలా చూశాడు. ఈ విషయాన్ని నా ఫ్రెండ్స్‌తో చెప్పడానికి కూడా నాకు చాలా భయమేసింది. ఆ దర్శకుడు నా కెరీర్ ను పూర్తిగా నాశనం చేశాడు. సినిమా అయిపోయే వరకు దర్శకుడు నన్ను ఓ శృంగార బొమ్మగానే చూశాడు " అంటూ నటి సౌమ్య చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications