ఈ హీరోయిన్ ఉంటే ఏ సినిమా అయినా ఫ్లాప్..?
సినీ ఇండస్ట్రీలో అదృష్టం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం కూడా కాసింత కలిసి రావాలి. అదృష్టం ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. అది హీరో అయినా హీరోయిన్ అయినా ఈ రూల్ వర్తిస్తుంది. ఒక్కసారి ఐరెన్ లెగ్ ముద్ర పడిందంటే చాలు..కోలుకోవడం చాలా కష్టం. సరిగ్గా ఇలాంటి ఇలాంటి సమస్యనే ఓ హీరోయిన్ ఎదుర్కొంటుంది.
ఆ హీరోయిన్ ఏ సినిమాలో నటించిన ఆ సినిమా ఫ్లాప్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు అను ఇమ్మాన్యుయేల్. ఈ అమ్మడు ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి.అను ఇమ్మాన్యుయేల్ కెరీర్‌ను ఓసారి పరిశీలిస్తే.. ఆమె ఖాతాలో ఒక్క హిట్ కూడా లేకపోవడం విశేషం.

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'మజ్ను' సినిమాతో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా పరిచియం అయింది. ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ కూడా అను ఇమ్మాన్యుయేల్‌కు హిట్ మాత్రం దక్కలేదు. తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది ఈ బ్యూటీ. ఇండస్ట్రీ మారిన లక్ మాత్రం కలిసి రాలేదు.
తమిళ హీరో కార్తీకి జోడిగా 'జపాన్' సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కార్తీ కెరీర్‌లోనే ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో అను ఇమ్మాన్యుయేల్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరినట్టు అయింది.అయితే అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేసింది.
అల్లు శిరీష్‌తో ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసింది. లిప్ లాక్స్‌తో పిచ్చెక్కించింది. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందని ప్రశంసలు అయితే దక్కాయి కానీ కాసులు మాత్రం కురిపించలేకపోయింది. దీంతో అను ఇమ్మాన్యుయేల్ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా ఫ్లాపే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అందం , అభినయం రెండు ఉన్నప్పటికీ అను ఇమ్మాన్యుయేల్‌కి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. దీంతో వరుస ఫ్లాప్‌లతో అమ్మడు కెరీర్ డెంజర్ జోన్‌లో పడింది. మరి ఫ్లాప్ హీరోయిన్ ముద్ర నుంచి అను ఇమ్మాన్యుయేల్ ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications