ఐశ్వర్యరాయ్ విడాకులకు ఆ హీరోయిన్ కారణమా..?
బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్, అభిషేక్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది.
ఫొటో సెషన్‌లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫొటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఇదిలా ఉంటే తాజాగా అభిషేక్ బచ్చన్ చేసిన ఓ పనితో వీరి విడాకులు ప్రస్తావన మరోసారి తెర మీదకు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకులకు సంబంధించిన పోస్ట్‌కు లైక్ కొట్టారు. దీంతో ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ మరోసారి ప్రచారం మొదలైంది. తాజాగా వీరి విడాకులపై మరో వాదన తెర మీదకు వచ్చింది.ఐశ్వర్య, అభిషేక్ విడిపోవడానికి సీనియర్ నటి రేఖ కారణం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీనియర్ నటి రేఖ అమితాబ్ ఇంట విభేదాలకు కారణం అని నెటిజన్లు అంటున్నారు.

అమితాబ్, రేఖ ఒకప్పుడు హిట్ పెయిర్. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, అమితాబ్, రేఖల మధ్య ఇప్పుడు మాటల్లేవు. ఇదే సమయంలో నటి రేఖ ఎక్కడైన కనిపిస్తే చాలు అమితాబ్ భార్య జయబచ్చన్ ఆగ్రహంగా ఉన్నట్టు కనిపిస్తుంటారు. దీంతో అమితాబ్, రేఖల మధ్య దూరం పెరిగిపోయింది.అలాంటిది రేఖతో ఐశ్వర్యరాయ్ క్లోజ్‌గా మాట్లాడుతూ అంబానీ పెళ్లిలో కనిపించింది. దీని కారణంగానే ఐశ్వర్య, అభిషేక్ విడిపోవడానికి రేఖనే కారణమని నెట్టింట పలు చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications