అదే నా జీవితంలో మర్చిపోలేని గాయం : నటి వరలక్ష్మి శరత్‌కుమార్
ఇటు టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ లేడి విలన్‌గా నటిస్తూ మంచి ఆఫర్లు అందుకుంటుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే విడుదలయి సంచలన విజయం సాధించిన జై హనుమాన్ సినిమాలో కూడా వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. త్వరలోనే శబరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది నటి వరలక్ష్మీ. ఇక, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఈమె తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది.
''బాల్యంలోనే నేను లైంగిక వైధింపులకు గురయ్యాను. అదే నా జీవితంలో మర్చిపోలేని గాయం అంటూ తన పర్సనల్ విషయాలను బయటపెట్టారు'' నటి వరలక్ష్మి శరత్‌కుమార్. జీవితంలో ట్రామా వంటి సమస్యలు ఉన్నప్పుడు కచ్చితంగా ఎవరినై సాయమయినా తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక సమస్యల గురించి చాలామంది ఓపెన్ అవ్వరు. కానీ, ఇలాంటి విషయాలు బహిరంగంగా మాట్లాడుకోవడం, ఇతరుల సహాయం తీసుకోవడం ఎంతో మంచిది అని చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్‌కుమార్.

ప్రతి ఒక్కరీకి థెరపిస్ట్ ఎంతో అవసరం..
ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరికి ఒక థెరపిస్ట్ ఉంటే బాగుంటుంది. స్నేహితులు, కుటుంబసభ్యులతో నీ సమస్యల గురించి మాట్లాడితే జడ్జ్ చేస్తారు. వారి అభిప్రాయాలు మీపై రుద్దే ప్రయత్నం చేస్తారు. అదే థెరపిస్ట్‌తో మాట్లాడితే అలా ఉండదు. మనల్ని సరైన మార్గంలో నడిపించే పని థెరపిస్ట్ చేస్తాడు. అందుకే మనకు ఏమైనా సమస్యలు ఉంటే థెరపిస్ట్ దగ్గరకు వెళ్లి వాటిని నయం చేసుకోవడం ముఖ్యం అంటూ చెప్పుకోచ్చారు వరలక్ష్మి.
ఇక, సినిమాపై తనకున్న అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. సినిమా అంటే తనకు జీవితం అని చెప్పుకొచ్చింది. తనకు తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు పనిచేస్తూ ఉంటానని, అదే తనకు సంతోషం కలిగిస్తుందని చెప్పింది. కేవలం తన వాళ్లకు తనగురించి తెలిస్తే చాలని, అందరూ తన గురించి ఏమనుకుంటున్నారో తాను అస్సలు పట్టించుకోనని తేల్చిచెప్పింది నటి వరలక్ష్మి శరత్‌కుమార్.












Click it and Unblock the Notifications