ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్లాఫ్ మూవీ ఏది..?
ఒక సినిమా రిలీజ్ అయ్యాక హిట్ కావడం లేదా ప్లాఫ్ కావడం సహజం. అయితే కొన్ని సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిస్తే.. మరికొన్ని సినిమాలు మాత్రం బిగ్గెస్ట్ ప్లాఫ్ లుగా మిగిలిపోతాయి. అయితే చాలా మంది మూవీ లవర్స్ కు బిగ్గెస్ట్ హిట్స్ మాత్రమే గుర్తుంటాయి. మరి భారతీయ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద ప్లాఫ్ చిత్రంగా రికార్డు మూటగట్టుకున్న సినిమా మీకు తెలుసా..?
స్టార్ కాస్ట్ ఉన్నా..
1990 దశకంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా టబు నిలిచారు. అప్పటికే ఉన్న అందరు సూపర్ స్టార్స్ తోనూ ఆమె నటించారు. తెలుగులోనూ నాగార్జునతో నిన్నే పెళ్లాడతా, 'ఆవిడా.. మాఆవిడే', చిరుతో 'అందరివాడు', బాలకృష్ణతో 'చెన్నకేశవరెడ్డి', వెంకటేశ్ తో 'కూలీ నెం.1' చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' చిత్రంలోనూ నటించారు. అయితే ఆమె ప్రధాన పాత్రలో 1998లో నటించిన చిత్రం "2001:దో హజార్ ఏక్".. ఈ మూవీలో టబుతో పాటు జాకీ ష్రాఫ్, డింపుల్ కపాడియా, రజత్ బేడీ లాంటి నటులు ఉన్నారు. ఈ సినిమాతోనే రజత్ బేడీ హీరోగా అరంగేట్రం చేశారు. ఈ సినిమానే ఆయనకు హీరోగా ఆఖరి సినిమా అవుతుందని అసలు ఊహించలేదు. కానీ అదే జరిగింది.

"2001:దో హజార్ ఏక్" మూవీ 1998లో రిలీజైంది. ఈ చిత్రం రూ.3.2 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే..రూ.4.4కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత టబూ కూ గూడా అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా అనేక మంది కెరీర్లను మార్చింది ఈ మూవీ. ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని ఇండియాలోనే అతిపెద్ద ప్లాఫ్ చిత్రంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications