రూ.52 లక్షలతో 8 రోజుల్లో మూవీ ఘాట్.. రూ.2100 కోట్లు కలెక్షన్స్ !
సినిమా.. ప్రజలకు వినోదాన్ని అందిస్తూనే భారీస్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా భాషల్లో.. ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటున్నాయి. ప్రస్తుతం కాలంలో అయితే బడ్జెట్ కూడా భారీస్థాయిలో కేటాయించి మంచి క్వాలిటీ కంటెంట్ ప్రేక్షకులకు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి వారం థియేటర్స్‌లో ప్రేక్షకుల్ని అలరించేందుకు వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉంటున్నాయి. మరికొన్ని ఓటీటీ వేదికగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
కాగా హారర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అనడంలో సందేహం అక్కర్లేదు. ఒకప్పుడు థియేటర్లలో సత్తా చాటితే ఇప్పుడు ఓటీటీలలో కూడా మంచి హిట్స్ అందుకుంటున్నాయి. అయితే తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు కూడా భారీ కలెక్షన్స్ రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సూపర్ సక్సెస్ స్టోరీల్ భాగంగానే అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచిన ఓ లెజెండరీ సినిమానే "ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ ". ఈ మూవీ వివరాలు మీకోసం ప్రత్యేకంగా...

8 రోజుల్లోనే షూటింగ్ ఫినిష్..
1999లో విడుదలైన ఈ సినిమా షూటింగ్ కేవలం 8 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ఈ సినిమా బడ్జెట్ కూడా కేవలం 60,000 డాలర్లు (రూపాయల్లో సుమారు 52లక్షలు). కానీ ఈ మూవీ అందరి అంచనాలను బ్రేక్ చేసి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. గ్లోబల్‌గా 248.6 మిలియన్ డాలర్ల బాక్సాఫీస్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే సుమారు 2161 కోట్లకు పైగా వసూలు చేసింది.
కథ..
సినిమా కథ 1994లో మేరీల్యాండ్ లోని బర్కిట్స్‌విల్లె సమీపంలోని బ్లాక్ హిల్స్ అడవిలో జరుగుతుంది. ముగ్గురు ఫిల్మ్ స్టూడెంట్స్-హీథర్ డొనాహ్యూ, జోషువా లియోనార్డ్, మైఖేల్ సి విలియమ్స్.. 'బ్లెయిర్ విచ్' అనే స్థానిక మంత్రగత్తె గురించి డాక్యుమెంటరీ తీయడానికి అడవిలోకి వెళతారు. మొదట స్థానికులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత అడవిలోకి అడుగుపెట్టిన వీరికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వారు తప్పిపోయి, ఒక్కొక్కటిగా భయానక అనుభవాలు ఎదుర్కొంటారు. వారి కెమెరాల్లో రికార్డ్ అయిన భయానక సన్నివేశాలే ఈ సినిమా హైలైట్. చివరికి ప్రేక్షకులు ఊహించని షాకింగ్ టర్న్‌తో కథ ముగుస్తుంది.
మార్కెటింగ్ స్ట్రాటజీ..
ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం కేవలం కథ, నటన మాత్రమే కాకుండా మార్కెటింగ్ స్ట్రాటజీ అని కూడా చెప్పొచ్చు. "Found Footage" స్టైల్లో చిత్రాన్ని తెరకెక్కించడం వల్ల ఇది నిజంగానే జరిగిన సంఘటన అని అంతా భావించారు. ఆ ముగ్గురు నిజంగానే కనిపించకుండా పోయారు అని ప్రమోషన్ చేయడం కూడా సినిమాకి బాగా కలిసొచ్చింది.

దాంతో ప్రజలు పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కట్టడంతో సినిమా కలెక్షన్లు ఊహించని స్థాయిలో వచ్చాయి. ఈ లెజెండరీ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ సినిమాలు అంటే ఇష్టపడే వారు చూడాల్సిన మూవీస్ లిస్ట్ లో చేర్చవచ్చు.
-
ప్రియాంక చోప్రా ఇంట్లో తీవ్ర విషాదం -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications