'మీ ఆశీర్వాదం కావాలి'.. రష్మిక పోస్టు వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ పెయిర్ గా నిలిచిన విజయ్ దేవరకొండ- రష్మిక డేటింగ్ వ్యవహారంపై రోజుకో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. వీళ్లిద్దరూ గత కొన్నేళ్లుగా డేటింగ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఎంగేజ్ మెంట్ కూడా జరిగినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ విషయంపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. నిశ్చితార్థం వార్తలు వచ్చాక.. విజయ్, రష్మిక చేతి వేళ్లకు రింగ్ లు ప్రత్యక్షమవడంతో ఆ రూమర్స్ మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో తాజాగా రష్మిక మందాన్న తన ఎక్స్ ఖాతాలో షాకింగ్ పోస్టు పెట్టారు. 'మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీ సపోర్ట్ కావాలి'.. అంటూ పోస్టు పెట్టారు. ఈ పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇక తాజాగా రష్మిక నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్.. ఈ నెల 7న తెలుగుతో పాటు హిందీలో మూవీ రిలీజ్ కానుంది. అలాగే ఈ నెల 14న.. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్లలో రష్మిక బిజీబిజీగా గడిపేస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందాన్నతోపాటు టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ మూవీని రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. అయితే తాజాగా రష్మిక చేసిన పోస్టు ఈ మూవీ ప్రొమోషన్ లో భాగంగానే కనిపిస్తోంది. మూవీని ఆశీర్వదించి.. సపోర్ట్ గా ఉంటారని ఆశిస్తూ ఆమె పోస్టు పెట్టినట్లు నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొంతమంది మాత్రం రష్మిక- విజయ్ నిశ్చితార్థం ఇటీవల జరిగిందని.. అందువల్లనే రష్మిక హింట్ ఇస్తోందని అంటున్నారు. ఇక రష్మిక- విజయ దేవరకొండ కాంబోలో వచ్చిన గీతా గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
All Hopes On #RashmikaMandanna's #TheGirlFriend
— CineCorn.Com (@cinecorndotcom) November 3, 2025
Hope She'll Deliver A Perfect Blockbuster
ఆ తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించారు. తాజాగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో మూడోసారి విజయ్ కు జోడీగా రష్మిక నటించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications