అల్లు అర్జున్‌కు షాక్ ఇచ్చే యోచనలో చంద్రబాబు ప్రభుత్వం?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప2. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో కీలకమైన భాగాల షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 15వ తేదీనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ మెగా అభిమానులతో, పవన్ కల్యాణ్ అభిమానులతో ఏర్పడిన గొడవల్ల సినిమా నిర్మాతలు డిసెంబరు ఆరోతేదీకి సినిమా విడుదలను వాయిదా వేశారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను మైత్రీమూవీస్ నిర్మిస్తోంది. ప్రస్తుతానికి కూడా మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవ సద్దుమణగలేదు. విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి.

స్థాయిని మరిచి మాటలు
మారుతీనగర్ సుబ్రమణ్యం వేడుకకు హాజరైన అల్లు అర్జున్ తనవారి కోసం ఎంతదూరమైనా వస్తానని, అభిమానుల కోసమే కష్టపడి హీరో అయ్యానని మాట్లాడిన మాటలు మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. పరిశ్రమలో హీరోగా పునాది వేసిన చిరంజీవిని మరిచి మాట్లాడకపోవడం అహంకారమేనని మండిపడుతున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవలే ఆయన సినిమాల్లో హీరోలు ఎర్రచందనం స్మగ్లర్లుగా నటిస్తున్నారని, ఇది ఎంతమాత్రం సరికాదన్నారు.

The government may not give an opportunity to increase ticket prices for Pushpa 2 in AP

చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి ఇచ్చారు
కొన్నాళ్లుగా తెలుగులో అగ్ర కథానాయకులు సినిమాలు విడుదలవుతుంటే ప్రభుత్వాలతో మాట్లాడుకొని థియేటర్లలో టికెట్ ధరలు రెండువారాలపాటు పెంచుకుంటున్నారు. ఏపీలో ఇటీవలే కల్కికి టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆ సినిమా నిర్మాత అశ్వనీదత్ చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి అనుమతి వచ్చింది. అల్లు అర్జున్ కు, పవన్ కల్యాణ్ అభిమానులకు ఉన్న విభేదాల నేపథ్యంలో పుష్పకు అనుమతి వస్తుందా? రాదా? అనే సందేహం వెంటాడుతోంది. అయితే ఈ సినిమా నిర్మాతలు విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో ఎక్కువ సన్నిహితంగా ఉంటారు. ఒకవేళ టికెట్ల పెంపు రాజకీయ కారణాలతో ఇవ్వొద్దనుకున్నా నిర్మాతలు గొట్టిపాటి రవికుమార్ ద్వారా అనుమతి తెచ్చుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఏ హీరో మద్దతు ప్రకటించలేదు. కల్కి సినిమాలో ప్రభాస్ నటించినప్పటికీ అశ్వనీదత్ ద్వారా మాత్రమే అనుమతి వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకైనా గొట్టిపాటి రవికుమార్ ద్వారానే మద్దతు వచ్చే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు అనుమతి వస్తుందా? రాదా? అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+