షారుక్ ఖాన్ భ‌ద్ర‌త విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం...

బాలీవుడ్ బాద్‌షాగా పేరు సంపాదించుకున్న షారుక్‌ఖాన్ తాజాగా జ‌వాన్ సినిమాతో రికార్డుల మోత మోగించాడు. గ‌త నెల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు 1100 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది. ఇంకా ఎన్ని కోట్లు కొల్ల‌గొడుతుందో తెలీదు. అయితే, షారుక్ సినిమాలు ఇంత‌లా క‌లెక్ష‌న్లు సృష్టించ‌డం ఇదేమీ మొద‌టిసారి కాదు. గతంలో తీసిన ప‌ఠాన్ మూవీ కూడా ఇదే ప‌ద్ధ‌తిని అవ‌లంభించింది.

అయితే ఇప్ప‌డు బాలీవుడ్ బాద్‌షాకు బెదిరింపు ఫోన్‌కాల్స్ , డెత్ నోట్స్ రావ‌డం ప్రారంభ‌మ‌య్యాయి. ఆయ‌నను చంపేస్తామంటూ కొంద‌రు గుర్తుతెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఫోన్స్ కాల్స్ వ‌స్తున్నాయి. ముంబైలోని ఆయ‌న నివాస స్థ‌లానికి డెత్ నోట్స్ వ‌స్తున్నాయి. అయితే ఈ విష‌యంపై మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆయ‌నకు మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ఓ అడుగు ముందువేసింది. ఆయ‌న కుటుంబానికి వైప్ల‌స్ భ‌ద్ర‌త క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

 Shahrukh Khan

వై ప్ల‌స్ భ‌ద్ర‌తా...
ఇటీవ‌ల షారుక్‌ఖాన్ చంపేస్తామంటూ కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆయ‌న‌కు లేఖ‌లు పంప‌డం జ‌రిగింది. దీంతో షారుక్ ఖాన్ వెంట‌నే ముంబ‌య్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఇందులో భాగంగానే షారుక్ కుటుంబానికి వైప్ల‌స్ భ‌ద్ర‌తా క‌ల్పించాల‌ని మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వం ముంబ‌యి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

గ‌తంలో ఇదే విధంగా చాలామంది సెల‌బ్రిటీల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు కూడా ఇలాంటి భ్ర‌ద‌తే క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్, స‌ల్మాన్ ఖాన్‌, అక్షయ్‌కుమార్ వంటి వారికి భ‌ద్ర‌త‌ల‌ను పెంచ‌డం జ‌రిగింది. అదే విధంగా ఇప్పుడు షారుక్ ఖాన్‌కు కూడా ఈ భ‌ద్ర‌త ఏర్పాట్ల‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేస్తున్నారు.

గ‌తంలో సినిమా కూడా ఇదే పరిస్థితి..
గ‌తంలో రీలిజైన ప‌ఠాన్ సినిమా కూడా ఎన్నో వివాదాల‌కు దారితీసింది. ఈ సినిమాలోని ఓ పాట‌పై అప్ప‌ట్లో చాలా దుమారం రేగింది. ఈ సినిమాలోని బేష‌ర‌మ్ రంగ్ పాట‌కు దీపికా పదుకోణే బికిని ధ‌రించ‌డంపై కొన్ని వ‌ర్గాలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసాయి. అప్పుడు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్, లెట‌ర్స్ చాలానే వ‌చ్చాయి.

అయితే షారుక్ ఖాన్ కోరిన మేర‌కు షారుక్ ఖాన్ కుటుంబానికి విఐపి భ్ర‌ద‌తా బ‌ల‌గాల‌కు చెందిన ఆరుగురు క‌మాండోల‌ను ర‌క్ష‌ణ‌గా ఇచ్చారు. ఇంకా న‌లుగురు సాయుధ పోలీసు అధికారుల‌ను కూడా ఇందులో భాగంగా పెట్టారు. అయితే, తాజాగా వ‌చ్చిన బెదిరింపుల దృష్ట్యా భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసింది ప్ర‌భుత్వం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+