స్టార్ హీరోకు షాక్, 33 సీసీటీవీల్లో ఏముంది?, హత్య చేసిన తరువాత ఏం జరిగిందంటే?

శ్యాండిల్ వుడ్ హీరో దర్శన్ తో పాటు అతని గ్యాంగ్ చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని హత్య చేశారని నమోదు అయిన కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను బెంగళూరు పోలీసులు సేకరించారు. బెంగళూరులో హత్య జరిగిన ప్రాంతం పరిసర ప్రాంతాల్లోని 33కి పైగా సీసీటీవీ ఫుటేజీలను బెంగళూరు పోలీసులు సేకరించారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయిన నిందితుల కదలికలు, వారు తిరిగిన ప్రాంతాలు, రేణుకాస్వామి మృతదేహం తరలించిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని సేకరించి విచారణ చేపట్టారు. రేణుకాస్వామి హత్య కేసులో సీసీటీవీ ఫుటేజీలే కీలక సాక్ష్యం కానున్నాయని కేసు దర్యాప్తు చేస్తున్న ఓ పోలీసు అధికారులు తనను కలిసిన మీడియాకు చెప్పారు.

The police have seized the CCTV footages in many areas in connection with the Hero Darshan case

ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 33కి పైగా సీసీటీవీ ఫుటేజీలు లభ్యమయ్యాయి. హత్యకు ముందు రేణుకాస్వామి పార్టీ చేసుకున్న స్టోనీ బ్రూక్ రెస్టారెంట్ నుంచి పట్టగెరె షెడ్, రెస్టారెంట్, షెడ్‌లో సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. కన్నడ హీరో దర్శన్, హీరో గర్ల్ ఫ్రెండ్, కన్నడ నటి పవిత్ర గౌడ్ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలు ఇప్పటికే సేకరించారు. ఇప్పటివరకు 33కి పైగా సీసీటీవీ ఫుటేజీలు సేకరించారు. ఇది ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించిన పోలీసు అధికారులు నివేదిక కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది.

సీసీటీవీ ఫుటేజీని ఎఫ్‌ఎస్‌ఎల్‌, సీఐడీ టెక్నికల్‌ యూనిట్‌కు పంపించిన అధికారులు పలు కోణాల్లో సాంకేతిక తనిఖీలు చేస్తారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరులోని పట్టగెరె షెడ్ లో నిర్బంధించి అతని మీద దాడి చేసి హత్య చేశారని పోలీసులు అంటున్నారు. పట్టగెరె షెడ్డులోనే రేణుకాస్వామిని ప్రాణం తీశారని, తరువాత ఆ శవం మాయం చెయ్యడానికి అక్కడే ప్లాన్ చేశారని పోలీసులు అంటున్నారు.

షెడ్ లో హత్య చేసిన తరువాత స్కార్ఫియో కారులో రేణుకాస్వామి శవాన్ని తరలించి తరువాత డ్రైనేజ్ లో విసిరేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. రేణుకస్వామి శవాన్ని తరలించిన స్కార్ఫియో కారును ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో ఏ1 నిందితురాలిగా నటి పవిత్రా గౌడ, ఏ2 నిందితుడిగా ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తో పాటు మొత్తం 17 మంది అరెస్టు అయ్యి జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+