‘మన శంకర వరప్రసాద్ గారు’కు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్న రాజకీయ పార్టీ నేత

ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారుకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. నయనతార కథానాయికగా నటించింది. విక్టరీ వెంకటేష్ ఓ క్యామియోరోల్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన వార్త ఏమిటంటే.. ఓ ప్రముఖ రాజకీయ పార్టీ నేత ఈ సినిమాపై వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ పార్టీ నేతకు చిరంజీవి మంచి మిత్రుడు. కానీ రాజకీయాలు ఎలా ఉంటాయనేది చిరంజీవికి ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది. తన సినిమాపై వ్యతిరేక ప్రచారం చేయిస్తోంది ఫలానా పార్టీకి చెందిన రాజకీయనేతే అని బాగా తెలుసు. అయినా ఏం చేయాలో, ఎలా ఎదుర్కోవాలో అర్థంకాని పరిస్థితి.

అనిల్ సినిమా అంటే మినిమం గ్యారంటీ
నిజం చెప్పులేసుకునేలోగా అబద్దం ప్రపంచాన్ని చుట్టివస్తుంది అనే నానుడి ఉంది. అలాగే సినిమా బాగా రాలేదని, దీన్ని మనవారు ఎవరూ చూడొద్దని, మొదటిరోజు మొదటి ఆట నుంచే వ్యతిరేకంగా ప్రచారం చేయమని తన అనుచరులను ఆదేశించారు. అంతేకాదు.. సినిమా బాగున్నప్పటికీ ప్రచారం మాత్రం ఆపొద్దని స్పష్టం చేశారు. బహుశా వారం రోజులపాటు ఈ వ్యతిరేక ప్రచారం ఉండే అవకాశం ఉంది. అయితే చిరంజీవి అభిమానులు, సన్నిహితులు ఈ ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఎందుకంటే దర్శకుడు అనిల్ రావిపూడి ఇంతవరకు ఫ్లాప్ ఇవ్వలేదు. అన్నీ హిట్ సినిమాలే ఇచ్చారు. ఆ ప్రకారం చూసుకున్నా ఈ సినిమా కచ్చితంగా విజయం సాధించాలి.

The political party leader who is orchestrating the campaign against chiranjeevi movie mana shankara Varaprasad garu

కంటెంట్ బాగుంటే ఎవరూ ఏం చేయలేరు
సినిమాలో కంటెంట్ బాగుంటే ఎవరు, ఎన్నిరకాలుగా ప్రయత్నించినప్పటికీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఈ రాజకీయ పార్టీ నేత చిరంజీవి సినిమాపై వ్యతిరేకంగా ప్రచారం చేయించడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆ విషయం చిరంజీవికి తెలుసు, ఆ రాజకీయ పార్టీ నేతకు తెలుసు. అంతేకాదు.. ఈ నేతతో చిరుకు వ్యాపార సంబంధాలున్నాయి. మరో హీరోతో కలిసి మరీ ఆ నేతతో వ్యాపార బంధం పెట్టుకున్నారు. అయినప్పటికీ తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్లుగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై వ్యతిరేక ప్రచారం మాత్రం చేస్తున్నారు. రేపటి నుంచి ఈ ప్రచారం ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వర్గాలంటున్నాయి. మరి చిరంజీవి సినిమా నెగ్గుతుందా? లేదంటే ఆ రాజకీయ నేత చేయించే వ్యతిరేక ప్రచారం నెగ్గుతుందా? అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+