వైరల్ వీడియో: నిధి అగర్వాల్ ను ఊపిరాడకుండా చేశారేంటి..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ మూవీపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు ఫ్యాన్స్ తో సినీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో రాజా సాబ్ చిత్రం నుంచి రెండో సాంగ్ ను తాజాగా హైదరాబాద్ KPHBలోని లులూ మాల్ లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
అయితే ఈ వేడుకలో టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇటీవల హరిహర వీరమల్లు చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రభాస్ తో జతకట్టింది. అయితే రాజా సాబ్ నుంచి రెండో పాట రిలీజ్ కోసం ఆమె KPHBలోని లులూ మాల్ కు వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

ఈవెంట్ అనంతరం నిధి అగర్వాల్ బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా పెద్దఎత్తున ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. దీంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒకింత ఆమెకు ఊపిరాడకుండా చేశారు. దీంతో ఎంతో నిరుత్సాహంతో ఆమె కారులోకి చేరుకున్నారు. అక్కడే ఉన్న బాడీగార్డులు ఆమెకు హెల్ప్ చేసి కారులోకి ఎక్కించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అలా మీదపడి పోతారేంట్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
This is just not the way ...people need to have some basic sense and keep distance. #NidhiAgarwal being mobbed by fans at #TheRajaSaab song launch pic.twitter.com/Y63ARTmgN3
— Arjun (@Arjun13135581) December 17, 2025
ఇక రాజాసాబ్ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. మరి కొద్ది రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా హైదరాబాద్ లోనే నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి వస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే గానీ జరిగితే ప్రభాస్, చిరంజీవి ఇద్దరు బిగ్ స్టార్స్ ను ఒకే వేదికపై చూసే భాగ్యం కలుగుతుంది. ఇక ఈ మూవీ ప్రీమియర్స్ జనవరి 8 న పడనున్నట్లు చిత్ర నిర్మాత ఇప్పటికే తెలిపారు. దీంతో రెబల్ ఫ్యాన్స్ సినిమా రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
-
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications