‘అఖండ2’ వారం రోజులు వాయిదా పడటానికి కారణం ఆ అగ్ర హీరో రాజకీయం!
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం అఖండ2. అయితే ఈ సినిమా డిసెంబరు 5వ తేదీన విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ సినిమా నిర్మాతలకు, ఇతర నిర్మాణ సంస్థతో ఉన్న విభేదాల కారణంగా వారం రోజులు ఆలస్యంగా 12వ తేదీన విడుదలైంది. అయితే ఇలా అఖండ2నును విడుదల కానివ్వకుండా తెలుగు పరిశ్రమలోని ఓ అగ్రహీరో నడిపిన రాజకీయమే కారణమని ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ విషయం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులందరికీ తెలుసు. అయితే తెలియనివారంతా, బాలయ్య అభిమానులు, ఇతర హీరోల అభిమానులు మాత్రం ఆ హీరో ఎవరబ్బా? ఎందుకు రాజకీయం చేశారు? అనే విషయంపై చర్చించుకుంటున్నారు.
సాధ్యం కాని రీతిలో దూసుకుపోవడంతో..
వాస్తవానికి అగ్ర కథానాయకుడిగా చెలామణి అవుతున్న బాలయ్య సినిమా విడుదల ఆగిపోయిందంటే ఒకరకంగా అది ఆయనతోపాటు అందరికీ అవమానం లాంటిదే. చివరకు అదే జరిగింది. కొన్నాళ్లుగా మంచి జోరుమీద వరుసగా హిట్లు కొడుతూ అగ్రహీరోలతోపాటు కుర్ర హీరోలకు సాధ్యం కానిరీతిలో బాలయ్య దూసుకుపోతున్నారు. అటువంటి బాలకృష్ణకు బ్రేక్ వేయాలని ఆ హీరో భావించారు. సినిమా నిర్మాతలకు ఈరోస్ సంస్థతో ఉన్న విభేదాల గురించి తెలుసుకున్నారు. అటువైపు నుంచి పావులు కదిపారు. వాస్తవానికి సినిమా మొదటి నుంచి ఎవరికీ ఇది తెలియదు. అయినా ఈరోస్ సంస్థ సినిమా విడుదలకు అడ్డుపడుతుందని కూడా ఎవరూ భావించలేదు. సినిమా విడుదలైన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి వారు సెటిల్ చేసుకుంటారని అందరూ భావించారుకానీ ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు.

పావులు కదపడంతో వాయిదా పడింది
చివరకు ఆ అగ్ర కథానాయకుడు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకొని పావులు కదపడంతో సినిమా వాయిదా పడింది. ఎందుకంటే ఒక్కసారిగా సినిమా విడుదల వాయిదా పడితే తర్వాత దానిమీద బజ్ ఏర్పడదు. అందులోను బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కావడంతో మరో సంచలన విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. ఇటువంటి తరుణంలో కాస్తంత బ్రేక్ వేస్తే తనకు కలిసివస్తుందని భావించారు. ఆ హీరోకు మరికొంతమంది తోడయ్యారు. వారంతా సినీ రంగంలోనే వివిధ విభాగాలకు చెందినవారు. అందరూ కలిసి ప్రణాళిక రచించారు. విజయవంతం చేశారు. అయితే ఇదంతా చాలా రహస్యంగా చేశారు. దీంతో ఎవరూ ఊహించలేకపోయారు.
దెబ్బ పడి సినిమా వాయిదా పడిన తర్వాత ఏం జరిగింది? అసలు కారణం ఎవరు? అనే విషయాలన్నీ ఆరా తీస్తే చివరకు ఆ అగ్ర కథానాయకుడి పేరు బయటకు వచ్చింది. అయినప్పటికీ బాలయ్యకానీ, నిర్మాతలు కానీ, దర్శకుడు కానీ ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. వారిపని వారు చేసుకుపోతున్నారు. బాలయ్య 111 వ సినిమా కూడా మొదలు పెట్టేశారు. ఆ అగ్ర కథానాయకుడు మాత్రం తన పని కాకుండా ఇతరుల పనిమీదే ఎక్కువగా దృష్టిపెట్టారు. మన పెద్దలు చెప్పినట్లు చెరపకురా చెడేవు.. అంటారు.. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే ఆ హీరోకే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications