ప్రతి జర్నలిస్ట్ తప్పక చూడాల్సిన సినిమా ఇది
ఈ రోజుల్లో మీడియా ఏది చెబితే అదే నిజం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం బయటకు రావడం లేదు. ప్రజాస్వామ్యానికి మీడియా ఫోర్త్ పిల్లర్ అని పిలుస్తుంటారు. అలాంటి మీడియా సంస్థలు కొన్ని పొలికటికల్ పార్టీలకు తొత్తుగా మారుతున్నాయి. సరిగ్గా ఇదే పాయింట్ మీద తీసిన సినిమానే 'ది సబర్మతి రిపోర్ట్'. ది సబర్మతి రిపోర్ట్ సినిమా, భారతదేశంలో జరిగిన కీలక సంఘటనను తెరపైకి తెచ్చిన ఒక మంచి ప్రయత్నం. ఈ సినిమా గురించి మనం విస్తృతంగా చర్చిద్దాం.
2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా రైలు ప్రమాదం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే అప్పటి ప్రభుత్వంతో పాటు, కొన్ని మీడియా ఛానెల్స్ ఇది కేవలం ప్రమాదంగా చిత్రీకరించి ప్రజలకు చూపించారు. కానీ వాస్తవాలు మాత్రం చాలా ఏళ్లకు బయటపడ్డాయి.రాజకీయపరమైన కారణాలతో పాటు, మతపరంగా చోటు చేసుకున్న విభేదాలు కారణంగానే గోద్రా రైలు ప్రమాదం జరిగినట్టు తేలింది. ఈ ప్రమాదంలో 59 మంది మరణించారు.

సినిమా గోద్రా రైలు మంట ప్రమాదం దాని తర్వాత జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించబడిందే ది సబర్మతి రిపోర్ట్ సినిమా. ఒక వీడియో జర్నలిస్ట్ ఈ ప్రమాదం దాని వెనుక ఉన్న పరిణామాలను అన్వేషించడానికి ప్రయత్నించే కథాంశం ఇందులో ఉంటుంది. అయితే సదరు మీడియా ఛానెల్ యాజమాన్యం కొన్ని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వాస్తవాలను దాచిపెడుతోంది. దీంతో ఆ వీడియో జర్నలిస్ట్ బయటకు వచ్చి వాస్తవాలను బయటకు చెప్పాడానికి పడిన కష్టాలను సినిమాగా రూపొందించారు.
గోద్రా రైలు మంట ప్రమాదం కాదని, కుట్ర అని చెప్పడం కోసం ఆ వీడియో జర్నలిస్ట్ పడే తపన సినిమాలో అద్భుతంగా చూపించారు. వాస్తవాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా సమాజంలోని విభిన్న వర్గాల మధ్య కలహాలకు దారితీసే పరిస్థుతులను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. సినిమాలోని కథాంశం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. సమాజంలోని విభిన్న వర్గాల మధ్య సామరస్యం కోసం మనం కృషి చేయాలనే అవసరాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది.
ముఖ్యంగా ప్రతి జర్నలిస్ట్ ఈ సినిమాను చూడాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. నేటితరం మీడియాలో కూడా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మీడియా పని. కానీ ప్రస్తుతం కాలంలో అలా జరగడం లేదు. పలు మీడియా ఛానెల్స్ రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారాయి. ఈ సినిమా చూసిన తర్వాతైన కొందరిలో మార్పు వస్తుందేమో చూడాలి.












Click it and Unblock the Notifications