Ustaad Bhagat Singh teaser: గ్లాస్ అంటే..: పవన్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్
అమరావతి: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం.. ఉస్తాద్ భగత్ సింగ్. హైఓల్టేజ్ యాక్షన్ మూవీ ఇది. హరీష్ శంకర్ దర్శకుడు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. శ్రీలీల హీరోయిన్. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. తమిళంలో విజయ్ నటించిన థేరి సినిమాకు రీమేక్ ఇది.2012లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ తరువాత పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో రానున్న సినిమా కావడం వల్ల దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

గబ్బర్ సింగ్ ఏ రేంజ్‌లో హిట్ కొట్టిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించిందా మూవీ. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సైతం అదే స్టైల్‌లో ఉంటుందని సంబరపడుతున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు పవన్ కల్యాణ్ రగ్డ్ లుక్స్‌లో కనిపిస్తోండటం మరింత హైప్‌ను ఇచ్చినట్టయింది.
ఈ మూవీ టీజర్ కొద్దిసేపటి కిందటే విడుదలైంది. 1:02 నిమిషాల నిడివి ఉండే ఈ టీజర్.. పవన్ కల్యాణ్ సత్తాకు అద్దం పట్టింది. పోలీస్ లుక్‌లో అదరగొట్టారు పవన్ కల్యాణ్. యాక్షన్ సన్నివేశాల్లో విరగదీశారు. ఇందులోనూ పొలిటికల్ డైలాగ్స్ పడ్డాయి ఆయనకు. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్‌ను ఓ సీన్‌లో చూపారు.

గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం అనే డైలాగ్స్.. జనసైనికులతో విజిల్స్ వేయిస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్.. జనసేన క్యాడర్‌కు బూస్ట్ ఇచ్చినట్టవుతోంది.












Click it and Unblock the Notifications