జైహనుమాన్ సినిమాలో కేజీఎఫ్ హీరో ?, కేజీఎఫ్ సీక్వెల్ టైపులో జై హనుమాన్ లో !

తెలుగు నిర్మించిన హనుమాన్ సినిమా అంచనాలకు మించి మెగా హిట్ అయ్యింది తెలుగుతో పాటు అనేక బాషల్లో విడుదల అయిన హనుమాన్ సినిమా సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంది, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారంతో పాటు సంక్రాంతి సందర్బంగా విడుదలైన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించింది.

సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 286 కోట్లకు పైగా వసూలు చేసిందని అంటున్నారు. జనవరి 22వ తేదీన రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు ముందే హనుమాన్ విడుదల కావడంతో దేశ విదేశాల్లో సినీ అభిమానులు ఆసినిమాకు బ్రహ్మరథం పట్టారు. హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. హనుమాన్ చిత్రానికి జై హనుమాన్ సీక్వెల్ తీస్తున్నట్లు ఇప్పటికే ప్రశాంత్ వర్మా ప్రకటించారు.

 There is a lot of hype going on that KGF hero Yash is acting in Jai Hanumans movie

కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్స్ లో హీరోగా నటించిన యష్ జై హనుమాన్ లో హనుమంతుడిగా నటించనున్నాడని గత కొన్ని రోజులుగా స్యాండిల్ వుడ్ లో ప్రచారం జరుగుతోంది. జైహనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటించేందుకు యశ్‌ను చిత్ర బృందం సంప్రదించినట్లు సమాచారం. ఈ నివేదికలు నిరాధారమైనవని, ఇవి పుకార్లు మాత్రమే అని, అవన్ని అవాస్తవాలని యష్ బృందం ధృవీకరించిందని ప్రముఖ ఆంగ్ల పత్రిక డీఎన్ఏ తెలిపింది.

జై హనుమాన్ చిత్రంలో యష్ హనుమంతుని పాత్రను పోషిస్తున్నారనే పుకార్ల గురించి ఆయన టీమ్ మాట్లాడుతూ ఈనివేదికల్లో నిజం లేదని, ఆయన అలాంటి పాత్రలో నటించడం లేదని యష్ టీమ్ చెప్పింది. రాకింగ్ స్టార్ యష్ చాలా సమయాన్ని ఆయన నటిస్తున్న టాక్సిక్ సినిమా కోసం కేటాయిస్తున్నాడని తెలిపారు. హీరో యష్ టాక్సిక్ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించి చాలా కష్టపడి పని చేస్తున్నారని ఆయన టీమ్ అంటోంది.

టాక్సిక్ చిత్రానికి నటి, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న టాక్సిక్ మూవీని కన్నడలో చిత్రీకరిస్తూ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం డబ్బింగ్ వెర్షన్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం పని చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+