బాహుబలి 1, బాహుబలి 2 లేవు... ఇక నుంచి ఒకటే బాహుబలి!

బాహుబలి.. ఈ పేరు వినగానే దేశవ్యాప్తంగా సినీ ప్రియుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వారిని అంతగా ఆకట్టుకుంది ఈ సినిమా. అలా తీర్చిదిద్దడంలో రాజమౌళి ఘనవిజయాన్ని సాధించారు. బాహుబలి1, బాహుబలి2గా ఇప్పటివరకు ప్రేక్షకులు సినిమాలు చూసుకుంటూ వస్తున్నారు. అయితే ఇకనుంచి ఇవి రెండుగా ఉండబోవడంలేదు. రెండింటినీ కలిపి ఒకటే సినిమా చేస్తున్నారు. బాహుబలి1లో కొన్ని సన్నివేశాలకు, బాహుబలి2లోని కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఒకటే బాహుబలిగా నిర్మాతలు దీన్ని సిద్ధం చేస్తున్నారు. అక్టోబరు నెలలో ఈ సినిమాను తిరిగి విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను ఒకటే భాగంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ఖండాంతరాలకు తెలుగువారి ఖ్యాతి
తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపచేసిన ఘనత కచ్చితంగా ఈ సినిమాకే దక్కుతుంది. అటువంటి సినిమా రెండు భాగాలుగా వచ్చిన తర్వాత ఎటువంటి సన్నివేశాలను తీసేస్తారు? ఏయే సన్నివేశాలను ఉంచుతారు? సినిమాను ఎడిట్ చేసిన తర్వాత ఒకటే బాహుబలి రన్ టైం ఎంతసేపు ఉంటుంది? అంత సమయం ప్రేక్షకులు కూర్చోగలరా? లేదంటే కేవలం రెండు భాగాలను కలిపి మూడు గంటల సమయానికే కుదిస్తారా? అనే ప్రశ్నలు అభిమానులను తొలిచేస్తున్నాయి. బాహుబలి1లోకానీ, బాహుబలి2లోకానీ అన్ని సన్నివేశాలు బాగుంటాయి. బాగోదు అని చెప్పడానికి అవకాశం ఉండదు. అటువంటి సినిమాను ఏవిధంగా ఎడిట్ చేస్తున్నారు? అనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది.

There is no Bahubali 1 there is no Bahubali 2 from now on there is only one Bahubali

పరిశ్రమను చంపేస్తున్నారు
హీరోల సినిమాలు రెండేళ్లు, మూడేళ్లు సమయం పడుతుండటంతో అభిమానులను అలరించడానికి వారు నటించి పాత సినిమాలకు కొత్తగా హంగులు జోడించి విడుదల చేయడం పరిపాటిగా మారిపోయింది. హీరోలు ఎందుకు అన్ని సంవత్సరాలు సినిమా చేస్తున్నారు అంటే కారణం లేదు. మూడేళ్లకు సరిపడా పారితోషికాన్ని తీసుకుంటున్నారు. నిర్మాతలు కూడా అందుకు సిద్ధపడుతున్నారు. ఒకవైపు అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్ లాంటి దర్శకులు స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసుకొని రెండు నుంచి మూడు నెలల్లోనే సినిమాలను తీసేస్తూ అలరిస్తున్నారు. అలాంటిది మన అగ్ర హీరోల సినిమాలు నత్తనడకలా షూటింగ్ జరుపుకుంటూ వాటిమీద ఖర్చు చేస్తున్న నిర్మాతలకు వడ్డీద్వారా భారీ నష్టాల్లోకి నెడుతున్నారు. ఈ పద్ధతి ఎప్పుడు మారుతుందంటే ఎవరి దగ్గరా సమాధానం లేదు. చేజేతులా తెలుగు సినీ పరిశ్రమను చంపేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+