'ఆ నలుగురి'కి ఏపీలో థియేటర్లు గోవిందా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా జూన్ 12వ తేదీన విడుదల చేయడానికి నిర్మాతలు రంగం సిద్ధం చేశారు. ఇటువంటి తరుణంలోనే జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ కు కొందరు ఎగ్జిబిటర్లు పిలుపునిచ్చారు. వాస్తవానికి ఎగ్జిబిటర్లెవరూ సొంతంగా థియేటర్లను నడుపుకోవడంలేదు. 95 శాతం మంది అగ్ర నిర్మాతలకు లీజుకు ఇచ్చేశారు. కొన్నిచోట్ల మాత్రమే కొందరు సొంతంగా నడుపుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ వీరిచేతిలోనే ఉన్నాయి. బంద్ కు పిలుపునివ్వడానికి ప్రధాన కారణం లీజు పద్ధతి కాకుండా లాభాల్లో వాటా పంచుకునే పద్దతి కావాలని.

హోంశాఖ కార్యదర్శితో కలిసి చర్చించిన మంత్రి
ఈ ప్రతిపాదన తీసుకువచ్చినవారు థియేటర్లు చేతిలో ఉన్నవారే అని పవన్ కల్యాణ్ తోపాటు జనసేన నాయకులు, కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హోం శాఖ కార్యదర్శితో కలిసి చర్చించారు. థియేటర్ల బంద్ ను వెనక్కి తీసుకున్నప్పటికీ దీనివెనక ఉన్న కుట్రకోణాన్ని ఛేదించాలని నిర్ణయించారు. తాజాగా పవన్ కల్యాణ్ కూడా సినిమావారికి కనీస కృతజ్ఞత లేదని, ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా కనీసం ఒక్కరు కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలవలేదంటూ మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. థియేటర్ల బంద్ వెనక ఏపీలో ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నేతలు ఉన్నారని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

There is no way anyone in AP will give theaters to those four in the future

సమాలోచనలు జరుపుతున్న అధికారులు
థియేటర్ల బంద్ నకు పిలుపునిచ్చి వెనక్కి తీసుకున్నప్పటికీ ఎవరి ఆదేశాల మేరకు వారు పిలుపునిచ్చారు? ఎవరి మాటలు వింటున్నారు? తన సినిమా విడుదలయ్యే సమయంలో ఎందుకు బంద్ అన్నారు? తదితర విషయాలపై పవన్ కల్యాణ్ ఆరా తీస్తున్నారు. ఏపీలో ఆ నలుగురికి థియేటర్లు లీజు పద్ధతిలో ఉన్నాయి. భవిష్యత్తులో వారికెవరికీ థియేటర్ యాజమాన్యం లీజుకివ్వకుండా సొంతంగా నడుపుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలన్నింటినీ అందించాలని ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ భావిస్తున్నారు.

థియేటర్ యాజమాన్యం నడుపుకుంటే వారికి ఎంత లాభం వస్తుంది? టికెట్ ధరలు ఎలా ఉండాలి? క్యాంటిన్ లోని తినుబండారాల ధరలు ఎలా ఉండాలి? ప్రేక్షకులను ఎలా థియేటర్లకు రప్పించాలి? అనే విషయాలపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. రానున్న కాలంలో ఏపీలో ఆ నలుగురితో థియేటర్ యాజమాన్యం లీజును రద్దుచేసుకునే అవకాశం కనపడుతోందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+