OG ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్..టాక్ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే, 'ఓజీ' సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ బోర్డు నుంచి 'ఏ' సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రంపై సెన్సార్ సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని అత్యద్భుతంగా వాడుకున్నారని సెన్సార్ సభ్యులు తెలిపారు.

కథ
పవన్ కళ్యాణ్ ఒక శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు, ముంబై నగరంలో తన ఆధిపత్యాన్ని స్థాపించి, ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్ళిన అతనిని మళ్ళీ ఎందుకు తిరిగి రప్పించారు అనేదే ఈ సినిమా కథాంశం. ఈ కథనం రొటీన్‌గా అనిపించినప్పటికీ, స్క్రీన్ ప్లే ,దర్శకుడు సుజీత్ టేకింగ్‌లోని వైవిధ్యం సినిమాకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది.

They Call Him OG First Review Is Pawan Kalyan s Film a Blockbuster

పవన్ కళ్యాణ్ నటన, ఎలివేషన్స్
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన నటన, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను మరోసారి ఆశ్చర్యపరచనున్నారు. ముఖ్యంగా, ప్రతి పది నిమిషాలకు ఒకసారి ప్రేక్షకులకు "హై" ఇచ్చే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని సెన్సార్ సభ్యులు పేర్కొన్నారు. యాక్షన్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ స్టామినాకు తగ్గట్టుగా అద్భుతమైన ఎలివేషన్స్ ఉన్నాయట. ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకే కాకుండా, భారతీయ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చే విధంగా రూపొందించబడింది.

సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్నిబ్లాక్‌బస్టర్ అని పేర్కొనడం సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. పవన్ కళ్యాణ్‌లోని స్టార్‌డమ్‌ను సుజీత్ పూర్తిగా వినియోగించుకున్నారని, ఈ సినిమాతో అతను భారీ విజయాన్ని సాధించబోతున్నారని వారు అభిప్రాయపడ్డారు. విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+