టాలీవుడ్ హీరోకు షాక్ .. 'పెళ్లయిన 3 రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోయింది'..!
విడాకులు కూడా కాదు.. పెళ్లయిన మూడు రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోయింది.. ఇదీ టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ నటిస్తున్న 'పాపం ప్రతాప్' స్టోరీ లైన్.. చాలా కొత్తగా ఉంది కదూ.. అవును ఆయన సినిమాలన్నీ కొత్త కాన్సెప్ట్ తోనే ఉంటాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు తిరువీర్. ఇటీవల ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం పాపం ప్రతాప్ అనే యూనిక్ స్టోరీ చేస్తున్నాడు. అయితే ఈ స్టోరీ లైన్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10 న థియేటర్లలో విడుదల కానుంది.

మసూద, పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన హీరో తిరువీర్. చిన్న సినిమాలతోనే హిట్ కొట్టడం ఈ హీరో ప్రత్యేకత. గతేడాది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'పాపం ప్రతాప్'.. ఈ చిత్రంలోని సరికొత్త స్టోరీ లైన్ కారణంగా ఈ మూవీపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఇక ఈ మూవీ వేసవి కానుకగా ఏప్రిల్ 10 న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ జంట లాగా ఏ జంటా
— ETV Win (@etvwin) February 27, 2026
లేదంట లేదే తెలుగింటా...#PapamPrathap
A Win Original Production
In Cinemas from April 10th 2026@iamthiruveeR @rakeshreddy1224 @krishna_kri @ThisisNitin1111 @payal_radhu @arvindmule_pd @vishutheone @GuruKiran87 @Saikishore040#WinJathara pic.twitter.com/BKj0WMcKgA
Divorce kuda kaadu… Pelli ayyi 3 rojullo ammayi vadilesi vellipoyindi.
— Milagro Movies (@MilagroMovies) March 16, 2026
Idhi #PapamPratap gadi story. 😢#Tollywood
ఇక పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి ఎస్. పీ దుర్గ నరేష్ దర్శకత్వం వహించారు. రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాయల్ రాధకృష్ణ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇక రీజినల్ కంటెంట్ ను అందిస్తూ దూసుకెళ్తోన్న ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్.. ఈ చిత్ర ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. గతేడాది లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, అనగనగా, కానిస్టేబుల్ కనకం, AIR వంటి వరుస విజయవంతమైన ఒరిజినల్స్ అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.. ఈ విజయ పరంపర ETV Winను రీజినల్ OTT రంగంలో ఒక బెంచ్ మార్క్ గా నిలిపింది.
-
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications