బాక్సాఫీస్ వద్ద ఇంతకన్నా దరిద్రమైన సినిమా రాదు..!

ఇటీవల కాలంలో సినిమా స్థాయి పెరిగింది. ఇండియన్ సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కంటెంట్ లేకపోయినప్పటికీ భారీగా నిర్మించి చేతులు కాల్చుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించబడి, అంచనాలకు తగ్గకుండా వసూళ్లు చేయలేకపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే అంచనాలకు తగ్గ వసూళ్లు సాధించలేకపోయింది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కంగువా' సినిమా కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. నిర్మాతలకు ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల నష్టాలను మిగిల్చింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'బడే మియా చోటే మియా' సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది.

This is the biggest flop movie in the film industry

పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడటం కొత్తేమీ కాదు. కానీ, హాలీవుడ్‌లో ఒక సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా భారీ నష్టాలను మిగిల్చిందంటే నమ్ముతారా? అదే 2012లో విడుదలైన 'జాన్ కార్టర్'. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా, విడుదలకు ముందు విజువల్ వండర్‌గా ప్రచారం పొందింది.

ఆండ్రూ స్టాంటన్ దర్శకత్వంలో, దాదాపు 250 మిలియన్ల (రూ. 2,171 కోట్లు) భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే, థియేటర్లలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయింది. అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ (VFX), కళ్లు చెదిరే విజువల్స్ ఉన్నప్పటికీ, బలహీనమైన స్టోరీలైన్, బలహీనమైన స్క్రీన్‌ప్లే..ముఖ్యంగా తప్పుదోవ పట్టించిన మార్కెటింగ్ వ్యూహాలు సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి.

ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎన్నడూ జరగనంత నష్టాన్ని, ఏకంగా రూ. 1,393 కోట్ల నష్టాన్ని డిస్నీకి మిగిల్చింది. ఇతర దేశాల్లో భారీ ప్రమోషన్లు చేసినా ఫలితం లేకపోయింది.కొన్ని ప్రాంతాల్లో యావరేజ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు క్రమంగా పడిపోయాయి. 'జాన్ కార్టర్' సినిమా, డిస్నీ కంపెనీ చరిత్రలో ఒక మర్చిపోలేని పీడకలగా మిగిలిపోయింది. ఇది భారీ బడ్జెట్‌తో సినిమా తీసినంత మాత్రాన విజయం వస్తుందని చెప్పలేమని, కథాబలం, సరైన మార్కెటింగ్ వ్యూహాలు ఎంత ముఖ్యమో నిరూపించిన ఒక చేదు అనుభవం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+