ఓటీటీలోకి 5 సూపర్ హిట్ సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్..

సినీ ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్రతివారం ఓటీటీల్లోకి పలు చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే ఈ వారం తెలుగు ప్రేక్షకులకు ఓటీటీలో పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌ కు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో జోనర్‌ లో అలరించనున్నాయి. అందులో మూడు సినిమాలు ఒకేరోజు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఈ వారం ఓటీటీలో ఏకంగా 5 సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్‌ కానున్నాయి. అవి ఒక్కోటి ఒక్కో రకమైన జోనర్లలో ఓటీటీ వేదికగా రిలీజ్ కు సిద్ధమయ్యాయి. అందులో మూడు సినిమాలు అయితే ఒకేరోజు రిలీజ్ కానున్నాయి. అందులో మొదటగా ఫార్మా చిత్రం విషయానికి వస్తే.. మలయాళంలో తెరకెక్కిన మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డ్రామానే ఇది. మెడికల్ కార్పోరేషన్‌ లో జరిగే అవినీతి చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 19న జియో హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.

ఫాల్ అవుట్ సీజన్ 2.. డిసెంబర్ 17 నుంచే ఓటీటీ మాధ్యమమైన అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్, డార్క్ కామెడీ సిరీస్‌ గా తెరకెక్కింది. ఈ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది. అలాగే నయనం అనే మూవీ కూడా ఓటీటీలోకి రాబోతోంది. ఈ మూవీ విషయానికి వస్తే.. వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్ జంటగా నటించిన ఈ సైకో థ్రిల్లర్ డిసెంబర్ 19 నుంచి జీ5 లో స్టీమింగ్ కానుంది. పక్క వారి జీవితంలో నాలుగు నిమిషాలు తెలుసుకునేందుకు ఓ డాక్టర్ చేసే ప్రయోగమే ఈ సినిమా.

This Week s OTT Lineup Pharma Fallout S2 Premante and Raju Weds Rambai Drop Fresh Entertainment

అలాగే ప్రేమంటే మూవీ డిసెంబర్ 19 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు రొమాంటిక్ కామెడీగా ఈ మూవీ తెరకెక్కింది. వీటితోపాటు సునీల్, ఇషాచావ్లా మూవీ దివ్య దృష్టి కూడా ఓటీటీ వేదికగా రిలీజ్ కానుంది. ఇక ఇటీవల రిలీజై సూపర్ హిట్ కొట్టిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా డిసెంబర్ 18వ తేదీ నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+