రెండేళ్లు జైల్లో ఉన్న స్టార్ హీరో కోడలు..ఏం చేసిందో తెలుసా..?
ఓ స్టార్ హీరో కోడలు రెండేళ్లు జైలు జీవితం గడిపారనే విషయం మీకు తెలుసా..? బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ కోడలు రెండేళ్లు జైలు జీవితం గడిపారు. అమితాబ్ కోడలంటే ఐశ్వర్య రాయ్ అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. అమితాబ్‌కు కోడలు వరుస అయ్యే తిలోత్తమ శోమ్ అనే అమ్మాయి రెండేళ్లు జైలు జీవితాన్ని అనుభవించారు. బచ్చన్ ఫ్యామిలీకి చెందిన కునాల్ అనే వ్యక్తిని తిలోత్తమ వివాహం చేసుకున్నారు.
ఇలా అమితాబ్ బచ్చన్‌కు తిలోత్తమ కోడలు వరుస అవుతుంది.తిలోత్తమ, కునాల్ పెళ్లికి బచ్చన్ ఫ్యామిలీ మొత్తం హాజరైంది.అయితే కునాల్‌తో డేటింగ్ చేసేటప్పుడు, అతడికి బచ్చన్ ఫ్యామిలీతో ఉన్న కనెక్షన్ గురించి తనకు తెలియదని తిలోత్తమ ఓ సందర్భంలో చెప్పింది.తిలోత్తమ కొన్ని సినిమాల్లో కూడా నటించింది. 2001లో 'మాన్‌సూన్ వెడ్డింగ్'తో తిలోత్తమ కెరీర్ ప్రారంభమైంది. అక్కడి నుంచి అనేక సినిమాలు, షోలు, ఓటీటీ సిరీస్‌లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

మెంటల్‌హుడ్, ఢిల్లీ క్రైమ్, ది నైట్ మేనేజర్, కోటా ఫ్యాక్టరీ, లస్ట్ స్టోరీస్ 2 వంటి సినిమాల్లో తిలోత్తమ నటించారు.ఆమె సర్ చిత్రంలో ఇంటి పనిమనిషి పాత్రను పోషించినందుకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకుంది.ఇదిలా ఉంటే తాను రెండేళ్లు జైలులో ఉన్నట్టు తిలోత్తమ శోమ్ ఓ ఇంటర్య్వూలో తెలిపారు.అయితే ఆమె ఏదో క్రైమ్ చేసి జైలుకు వెళ్లానని అనుకోవద్దని ఈ భామ తెలిపింది. న్యూయార్క్‌లో చదువుకుంటుండగా.. ఖైదీల మనస్తత్వాలను స్టడీ చేయడం కోసం ఏకంగా రెండేళ్ల పాటు జైల్లో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది.ఆ సమయంలో ఆడ, మగ ఖైదీలతో కలిసి పని చేసినట్టు ఆమె పేర్కొన్నారు. అక్కడి ఖైదీలకు నటనకు సంబంధించిన పాఠాలు చెప్పేదాన్ని అని తిలోత్తమ తెలిపింది.












Click it and Unblock the Notifications