Tillu square: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న టిల్లు స్క్వేర్..

సిద్ధు జొన్నలగడ్డ.. ఎప్పుడో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినా.. డీజే టిల్లుతోనే అతనికి పేరు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన డీజే టిల్లు పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా డీజే టిల్లు సిక్వెల్ టిల్లు స్వ్కేర్ కూడా ఘన విజయాన్ని అందుకుంది. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కలెక్ట్ చేసే దిశగా దూసుకెళ్తోంది. డిఫరెంట్ డైలాగ్ డెలవరీ, బాడీ లాగ్వేజ్ తో సిద్ధు ప్రేక్షకుల హృదాయాన్ని దోచుకున్నారు.

టిల్లు స్క్వేర్ 9 రోజు భారీగా వసూలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ మూవీ రూ. 1.60 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.10 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 9 రోజుల్లో రూ.52 కోట్లకు పైగా షేరు.. వంద కోట్ల గ్రాస్ సాధించింది. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. సిద్దు సినీ ఇండస్ట్రీలోకి సైడ్ యాక్టర్ గా ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారాడు.

Tillu Square is collecting huge money at the box office

అతను ఈ స్థాయికి రావాలంటే 12 ఏళ్లు పట్టింది. ఎన్నో ప్రయత్నాలతో సిద్ధు విజయం సాధించాడు. కేరీర్ స్టార్టింగ్లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు సిద్ధు. తనను ఎన్ని మాటలు అన్నప్పటికీ తన ప్రయత్నాన్ని ఆపలేదని చెప్పాడు. సిద్ధు ప్రస్తుతం టిల్లు స్క్వేర్ విజయం ఎంజాయ్ చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ చూసిని సినీ ప్రముఖులు సిద్ధును అభినందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా టిల్లు స్వ్కేర్ టీంను ప్రశంసించారు. జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా సిద్ధు, ప్రోడ్యూసర్, విశ్వక్ సేన్ కు పార్టీ కూడా ఇచ్చారు.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. "డియర్ సిద్ధూ నీ విజయాన్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంత గొప్ప సక్సెస్ అందుకున్నందుకు అనుపమ, మల్లిక్ రామ్, సంగీత దర్శకులు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, టీమ్‌ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు" అని రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+