ఓటీటీలోకి వచ్చేసిన రవన్న.. ఇక రచ్చ రచ్చే..!

ప్రస్తుత కాలంలో ఓటీటీ (OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన సినిమా 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే సినిమా చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తక్కువ ఖర్చుతో కుటుంబమంతా కలిసి సినిమా చూసే అవకాశం ఉండటంతో, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన 'సు ఫ్రమ్ సో' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాను తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. జియో హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

సు ఫ్రమ్ సో సినిమా తెలుగు వారికి బాగా కనెక్ట్ కావడానికి డబ్బింగ్ వర్క్ ప్రధాన కారణం. డైలాగ్స్ చెప్పించిన తీరు.. రాసిన విధానం.. ముఖ్యంగా రాజ్ బీ శెట్టికి డబ్బింగ్ చక్కగా సరిపోవడమే కాకుండా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్‌ను క్రియేట్ చేసింది. వేష భాషలు, ఎన్విరాన్‌మెంట్ చూస్తే.. కన్నడ వాసన కొట్టొచ్చినట్టు కనిపించినా.. డబ్బింగ్ వర్క్ కారణంగా పక్కాగా తెలుగు సినిమాను చూస్తున్నామా? అనే మూడ్‌ను క్రియేట్ చేయడం ఈ సినిమా సక్సెస్ ప్రధాన కారణమవుతుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణంగా మారడమే కాకుండా పలు సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసిందని చెప్పాలి. తెలుగు డైలాగ్స్ బాగా కుదిరాయి. ఈ సినిమాను మిస్ చేసుకోకుండా తప్పకుండా థియేటర్‌లోనే చూడండి.. ఈ మధ్యకాలంలో ఓ మంచి చిత్రాన్ని చూశామనే సంతృప్తి మిగలడం గ్యారెంటి.

Title Su From So OTT Release A Must-Watch Family Entertainer

ఇక సెకండాఫ్‌లో స్వామిజీ పాత్రతో కొంత మేరకు సినిమాను రాజ్ బీ శెట్టి భుజాన వేసుకొంటే.. ప్రీ క్లైమాక్స్ నుంచి భాను పాత్రలోనే ఎమోషన్స్, గుండెను తట్టిలేపే భావోద్వేగాలు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ఇక చివర్లలో అశోక్ నటనపరంగా క్రేజీగా ఆకట్టుకోవడం, రవన్న క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసిన విధానంతో సినిమా పరిపూర్ణంగా మారిపోతుంది. అంతా కొత్తవారితోనే చిన్న పాటి ప్రయోగం చేశారు. అలా నటించిన వారంతా గుర్తుండిపోయేలా ఫెర్ఫార్మెన్స్ చేశారు. శనీల్ గౌతమ్, ప్రకాష్ కే తుమినాడ్, దీపక్ రై పణజె కూడా బాగా నటించారు.

సు ఫ్రమ్ సో గొప్పగా చెప్పుకోవడానికి కథాపరంగా ఏమీ కనిపించదు. అందమైన గ్రామీణ ప్రాంతంలోని ప్రజల అమాయకత్వం, నిజాయితీతో కూడిన సన్నివేశాలు, గ్రామంలో ఉండే ఆచారాలతో సరదాగా సినిమా సాగిపోతుంది. ఈ సినిమా చూసేంత సేపు బుర్రకు పదును పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. కథలోని సన్నివేశాలు, పాత్రలు మనసును తాకుతూనే ఉంటాయి. భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. స్వామిజీ (రాజ్ బీ శెట్టి) ఎంట్రీతో సెకండాఫ్ హిలేరియస్‌గా ఉండబోతుందనే హింట్ దొరికిపోతుంది. ఫస్టాఫ్‌లో బావ క్యారెక్టర్ లెంగ్త్ ఎక్కువగా ఉండటం వల్ల ల్యాగ్ ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. కన్నడలో వర్కవుట్ కావొచ్చేమో.. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొంత సహనానికి పరీక్షలానే ఆ పాత్ర అనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+