టాలీవుడ్ ప్రముఖ దర్శకుడికి మేజర్ సర్జరీ..?
తెలుగు చిత్రపరిశ్రమకు మరో షాకింగ్ న్యూస్ అందింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ లివర్ సర్జరీ చేయించుకున్నారు. గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మేజర్ లివర్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సర్జరీ ముగిసి, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు వీవీ వినాయక్ ఎల్బీనగర్ లో ఉన్న కామినేని హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
గత కొంత కాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన చివరగా ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ హీరోగా నటించారు. ఈ చిత్రం గత ఏడాది బాలీవుడ్‌లో విడుదలయ్యి దారుణంగా ప్లాప్ అయ్యింది. అప్పటినుంచి వీవీ వినాయక్ ఎలాంటి ప్రాజెక్టు తీయలేదు. అనౌన్స్ చేయలేదు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఓ చిత్రం అనౌన్స్ చేశారు కానీ అది పలు కారణాలతో ఆదిలోనే ఆగిపోయింది. ఆ సినిమాలో వీవీ వినాయక్‌నే హీరోగా అనుకున్నారట.. వివి వినాయక్ ఆరోగ్యం పై వస్తున్న వార్తలతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే, వి వినాయక్ రాయదుర్గంలో కొన్నేళ్ళ క్రితం ఒక ఖరీదైన బంగ్లాని నిర్మించుకున్నారు. కానీ, ఆ బంగ్లాని అమ్మి ఇటీవలే కోకాపేట్ లో ఉన్న ఒక పోష్ అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నఅభిమానుల, ఆయన త్వరలోనే కోలుకుని మళ్లీ సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజకు సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరగడం, ఆయనకు చిన్నపాటి సర్జరీ అవ్వడం తెలిసిన సంగతే. ఇక, రవితేజ ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయినట్లు సోషల్‌మీడియాలో ఓ ట్వీట్ కూడా షేర్ చేశారు.
-
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications