Prabhas-Nayanthara:శివపార్వతులుగా ప్రేక్షకుల ముందుకు..!
వెండి తెర ఆదిపురుష్‌తో లేడీ సూపర్ స్టార్ నయన సందడి చేయనుంది. ఇప్పుడు ఈ వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మంచువారి డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఇటీవలే పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా సినిమాను మోహన్‌బాబు, విష్ణు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో అలరించనున్నట్లు ఇప్పటికే మంచు విష్ణు ఓ ట్వీట్‌తో కన్ఫామ్ చేశారు.
అయితే, తాజాగా ఇదే ప్రాజెక్ట్‌లో నయనతార కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా శివుని పాత్రలో నటించబోతోన్న పభాస్‌కు జోడీగా పార్వతీదేవిగా ప్రేక్షకులను ఆలరించబోతోందట ఈ జంట. అయితే, ఇన్నేళ్ల తర్వాత కలిసి నటించబోతోన్న ప్రభాస్, నయనతారల జంటను పాన్ ఇండియా మూవీగా వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు మాత్రం ఆశగా ఎదరు చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

16 ఏళ్ల తర్వాత..
ప్రభాస్- నయనతార జంట 2007లో విడుదలైన యోగీ సినిమా తర్వాత మరెక్కడా కలిసి నటించలేదు. అంటే దాదాపు 16ఏళ్ల తర్వాత ఈ మాస్ హీరో క్లాస్ హీరోయిన్‌తో ప్రేక్షకులను ఆలరించనున్నారు. అంతేకాదు, నయనతార చాలా ఇంటర్వ్యూల్లో ప్రభాస్‌తో నటించడం చాలా కన్ఫర్ట్‌గా ఉంటుందని, అతను చాలా సింపుల్‌గా ఉంటూ.. సెట్‌లో అందరితో సరదాగా ఉంటారని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ప్రభాస్‌ది చిన్నపిల్లవాడి మనస్తత్వం అని చెబుతూ.. ప్రభాస్ ఫ్యాన్స్ మనసును దోచేసింది.

మరోవైపు ఆదిపురుష్ సినిమాతో ఇప్పటికే ప్రభాస్ రాముడి గెటప్‌లో భక్తి సినిమాల్లోనూ తానేం తక్కువకాదని వెండితెరపై సత్తా చాటగా.. అటు నయనతార సైతం పలు చిత్రాల్లో అమ్మవారిగా కనిపించి బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్‌గా క్రెడిట్ కొట్టేసింది నయనతార. గత 20 ఏళ్లుగా సినీ ఇంస్ట్రీని ఏలుతూ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.
ఇప్పుడు తాజాగా కన్నప్ప చిత్రంతో వీరిద్దరి కెమిస్ట్రీ తప్పకుండా ప్రేక్షకుల మనసును కట్టిపడేస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక కన్నప్ప స్టోరీ విషయానికి వస్తే మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించనున్నారు. చిత్రాన్ని ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. అయితే, ఈ భక్త కన్నప్ప సినిమా షూటింగ్ విదేశాలలో జరగనుండడం ఇక్కడ కొసమెరుపు.












Click it and Unblock the Notifications