టాలీవుడ్ స్టార్ హీరో షాడో- ఎవరో గుర్తు పట్టగలరా?

Allu Arjun: అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్నారు. పాన్ ఇండియా సినిమా చరిత్రను తిరగరాసిన ఈ మూవీ ఇది. ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు. కోలీవుడ్ కు చెందిన అట్లీ దర్శకత్వం వహిస్తోన్న సైంటిఫిక్ మాస్ ఎంటర్టైనర్ ఇది. అల్లు అర్జున్ కు ఇది 22వ మూవీ. అలాగే- అట్లీకి ఇది ఆరో సినిమా. దీని వర్కింగ్ టైటిల్.. 'AA22 x A6'.

బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణే ఇందులో కథానాయిక. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీలో కీ రోల్ లో కనిపించింది దీపిక. దాని తరువాత ఆమె నటించనున్న మరో తెలుగు మూవీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్.. ఈ సినిమాను నిర్మించనున్నారు.

Tollywood star actor enjoy at Universal Studios

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కబోతోంది అల్లు అర్జున్- అట్లీ మూవీ. పాన్ ఇండియాగా టాలీవుడ్ సత్తాను మరోసారి చాటబోతోంది. అల్లు అర్జున్- దీపికా పదుకొణే కలిసి పని చేయడం ఇదే తొలిసారి. అట్లీ దర్శకత్వంలో నటించడం ఇది రెండోసారి.

అంతకుముందు ఆమె అట్లీ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ జవాన్ లో నటించింది. షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ ను పంచుకుంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తో జతకట్టింది. వారియర్ క్వీన్ రోల్ లో ఆమె మెరుపులు మెరిపించనుంది. కల్కిలో ఎటువంటి కీలక పాత్రను పోషించిందో.. ఇందులో కూడా అంతే ప్రయారిటీ ఉన్న రోల్ ను ఆమె కోసం డిజైన్ చేశాడు దర్శకుడు అట్లీ.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలో - ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి అమెరికాలోని యూనివర్సల్ స్టూడియోస్‌ను సందర్శించారు. భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్, స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

యూనివర్సల్ స్టూడియోస్‌లో అల్లు అర్జున్ తన పిల్లలతో సరదాగా గడుపుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూనివర్సల్ స్టూడియోస్ మెయిన్ గేట్ వద్ద ఉన్న గ్లోబ్ దగ్గర అల్లు అర్జున్ తన కుమారుడు అయాన్‌తో కలిసి దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది. స్టూడియో పార్క్ బోర్డు దగ్గర మరో అర్హతో కలిసి ఫొటో దిగారు అల్లు అర్జున్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+