షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించిన స్టార్ కమెడియన్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది విజయదశమికి విడుదలవుతోంది. త్వరలోనే వార్2 చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడు. దీనికి సంబంధించి డేట్లు కూడా ఇచ్చేశారు. దేవర మొదటి భాగం పూర్తయిన తర్వాత దేవర2 చేస్తారా? లేదంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
పూర్తిగా మారిపోయిన తారక్
యంగ్ టైగర్ మొన్నటివరకు ఎంత అధిక బరువుతో ఉండేవారో అందరికీ తెలిసిందే. దీనిపై విమర్శలు రావడంతో కంత్రీ, యమదొంగ సినిమాల సమయానికి పూర్తిగా తనను తాను మార్చుకోగలిగారు. యమదొంగ సినిమాలో తారక్ తోపాటు అలీ కూడా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో తారక్ బరువు గురించి అలీ ప్రస్తావించడంతోపాటు కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అలీ ఏం మాట్లాడాడు? అనే విషయాన్ని ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.

హరికృష్ణకు తండ్రిలా ఉన్నావు
శరీర బరువు గురించి మాట్లాడుతూ అంతకుముందు హరికృష్ణకు తండ్రిలా ఉండేవాడివని, ఇప్పుడు మాత్రం హరికృష్ణకు కొడుకులా ఉన్నావంటూ అన్నారు. అదేంటన్నా అలాంటి మాటన్నావు.. నేను అంత ఛండాలంగా ఉండేవాడినా? అని తారక్ అలీని ప్రశ్నించారు. అయితే అలీ అలా అన్నందుకు ఎంతో బాధపడ్డానన్నారు. అయితే తర్వాత మాత్రం చాలా సంతోషంగా అనిపించిందన్నారు. హరికృష్ణకు తండ్రి అంటే ఎన్టీరామారావుకదా.. కాబట్టి ఎన్టీ రామారావుతో తనను పోల్చడం ఎంతో సంతోషం అనిపించిందన్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని తారక్ చెప్పారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ శరీర బరువుకు సంబంధించి అలీ చేసిన కామెంట్స్ అంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications