సూర్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పేరు తెలియని సినీ ప్రేమికులు ఉండరు. ఈయన తెలుగులో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇటీవలే సూర్య హీరోగా నటించిన కంగువా చిత్రం విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం ఆయన మరికొన్సి ప్రాజెక్టులతో బిజిగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన సూర్య44 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పడు ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం.. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు శ్రియ శరన్..ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు.
కన్ఫర్మ్ చేసిన నటి..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ సూర్య44 సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇటీవలే గోవాలోజరిగిన ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో పాల్గొన్న శ్రియ మీడియాతో మాట్లాడారు.. "సూర్య సార్ కోసం నేను ఓ స్పెషల్ సాంగ్ చేశాను ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ వార్త విన్న సూర్య అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. నటి శ్రియా గతంలో కూడా చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించారు. చాలామటుకు ఆ పాటలు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. శ్రియా పెళ్లి అనంతరం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతున్నారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తున్నారు.

గ్యాంగ్ స్టార్ పాత్రలో..
ఇదిలా ఉండగా, సూర్య44 విషయానికొస్తే వచ్చే ఏడాది వేసవిలో ఈమూవీ రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జులై లో సూర్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమా గ్లిమ్ప్స్ ను విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాలో హీరో సూర్య గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications