రీ-రిలీజ్‌లో అత్యధిక కలెక్షన్లతో నెం.1 స్థానంలో నిలిచిన తెలుగు సినిమా
మన హీరోలు సంవత్సరానికి, రెండు సంవత్సరాలకు, మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒక సినిమా విడుదల చేస్తున్నారు. మిగిలిన కాలానికి సరిపడా పారితోషికాన్ని కూడా తీసుకుంటుండటంతో వారికి ఇబ్బంది లేకపోయినా థియేటర్ల యాజమాన్యం మాత్రం ఇబ్బంది పడుతోంది. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య కూడా తగ్గిపోతోంది. అభిమానులు కూడా తమ హీరోల సినిమాలు తరుచుగా రాకపోవడంతో పాత సినిమాలనే మళ్లీ మళ్లీ విడుదల చేయించుకుంటూ, వాటినే చూసుకుంటూ ఆనందపడుతున్నారు.
ఇలా ప్రారంభమైన రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు విడుదలైన సినిమాల జాబితాలను పరిశీలిస్తే రీరిలీజ్ లో పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ మిగతా హీరోలకంటే నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. తను నటించిన బాహుబలి1, బాహుబలి2 సినిమాలను రెండింటినీ కలిపి రాజమౌళి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో రీరిలీజ్ చేశారు. ఈ సినిమా దాదాపుగా రూ.52 కోట్లను రాబట్టి సంచలన రికార్డును నెలకొల్పింది. కొత్త విడుదలయ్యే చిన్న బడ్జెట్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయినా ఇంత రాబట్టలేకపోతున్నాయి.

అప్పటి హీరోలకు, ఇప్పటి హీరోలకు ఇదే తేడా
బాహుబలి తర్వాత విజయ్ హీరోగా నటించిన ఒక్కడు రీమేక్ గిల్లి రూ.33 కోట్లు, పడయప్ప రూ.19 కోట్లు రాబట్టి వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. వీటి తర్వాత స్థానాల్లో వరుసగా అజిత్ మాంధాత, విజయ్ సచీన్, మహేష్ బాబు ఖలేజా, మురారి, గబ్బర్ సింగ్, ఖుషి, ఆరెంజ్, బిజినెస్ మెన్, ఆర్య2, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, అతడు, మళయాళ మూవీ దేవధూతం, స్పడికం, సింహాద్రి, రావణ ప్రభు తదితర సినిమాలు నిలిచాయి. తెలుగులో అయితే శివ, సలార్, ఈనగరానికి ఏమైంది, సూర్య సన్నాఫ్ కృష్నన్, ఇంద్ర, జల్సా, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఒక్కడు, యమదొంగ, 7-జీ బృందావనకాలనీ, ఓయ్, పోకిరి, దేశముదురు, తొలిప్రేమ, చెన్నకేశవరెడ్డి, బిల్లా తదితర సినిమాలున్నాయి.
అభిమానుల గురించి ఆలోచించకుండా, థియేటర్ల యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల గురించి ఆలోచించకుండా సినిమాలు చేస్తున్న మన ప్రస్తుత హీరోలకు, గతంలో నిర్మాత, దర్శకుడి నుంచి లైట్ బాయ్ వరకు ఆలోచించే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ లాంటి హీరోలకు చాలా తేడా ఉంది. అందుకే వారంతా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విజయాలు సాధించి అజరామరం అనిపించుకున్నారు. ఇప్పటి హీరోలు మాత్రం అన్నీ తాత్కాలిక విజయాలే సాధిస్తూ, తాత్కాలికంగానే పేరు తెచ్చుకుంటున్నారు.
-
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications