జనసేనలోకి తెలుగు స్టార్ హీరో..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ప్రజల తరుఫున పోరాడుతున్న సంగతి అందరికి తెలిసిందే. గత పదేళ్లుగా పార్టీని నడుపుతున్న పవన్ కల్యాణ్ అనుకున్నంతగా విజయం సాధించలేకపోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కల్యాణ్ ఓడిపోవడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఆయన పోటీ చేసే నియోజకవర్గంపై ఇప్పటి వరకూ క్లారిటీ లేకపోడంతో అభిమానులు అందోళనకు గురవుతున్నారు. ఇక జనసేనలో అనుకున్న స్థాయిలో నేతలు కూడా లేకపోవడం ఆ పార్టీకి పెద్దగా సమస్యగా మారింది. పవన్ కల్యాణ్, నాదేండ్ల మనోహర్ తప్పిస్తే.. జనసేనలో పేరున్న నాయకులు లేరు. పవన్ కల్యాణ్ క్రేజ్ వాడుకున్న హీరోలు సైతం జనసేన వైపు చూడకపోవడం సంచలనంగా మారింది.

Tollywood young hero clarity about political entry

అల్లు అర్జున్, నితిన్ వంటి స్టార్ హీరోలు పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ ఉపయోగించుకున్నారు తప్పిస్తే.. ఆయనకు రాజకీయంగా ఏవిధంగా సాయపడలేదు. ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ జనసేన పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చారు. విశ్వక్ సేన్ తాజాగా నటించిన గామి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఊహించని ప్రశ్న ఎదురైంది.మీ నాన్న గారు ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు.

ఇప్పుడు మీరు ఏమైనా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందా అంటూ ప్రశ్నించగా ..దీనిపై విశ్వక్‌ సేన్‌ నుంచి అదిరిపోయే ఆన్సర్‌ ఇచ్చాడు. సున్నితమైన అంశం కావడంతో విశ్వక్ సేన్ దీనిపై అచితూచి స్పందించాడు. చాలా తెలివిగా డొనాల్డ్ ట్రంప్‌కి తాను పెద్ద ఫ్యాన్‌.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే సమయంలో అక్కడికి వెళ్లి ఓటు వేస్తాను అంటూ సమాధానం ఇచ్చాడు.రాజకీయాలతో నాకు సంబంధం లేదు.. నన్ను అందులోకి లాగొద్దు అన్నట్టుగా విశ్వక్‌ సేన్‌ చెప్పిన తెలివైన సమాధానంకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+