రామ్ చరణ్ వల్లే నా కెరీర్ ఇలా అయింది
మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వారి లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. రవితేజ, శ్రీకాంత్ వంటి హీరోలు చిరంజీవిని ఇన్సిప్రేషన్‌గా తీసుకునే ఇండస్ట్రీలో రాణించగలిగారు. వీరితో పాటు నాని, శర్వానంద్ వంటి యంగ్ హీరోలు సైతం చిరంజీవినే తమ అభిమాన నటుడుగా కొలుస్తుంటారు.
హీరో శర్వానంద్ తాజాగా మంచు మనోజ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఉస్తాద్ షోకు గెస్ట్‌గా రావడం జరిగింది. ఈ సమయంలో శర్వానంద్ సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో ఆయన పంచుకున్నాడు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ..,.చిరంజీవిగారు ఎంతో గొప్పవారు.. ఆయన తన పక్కన వాళ్లని ఎంతో గొప్పగా చూసుకుంటారని శర్వా చెప్పుకొచ్చారు.

ఈ రోజు నేను ఇంత గొప్పగా ఉన్నా అంటే రామ్ చరణ్ లాంటి ఒక మంచి స్నేహితుడు వల్లే. రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు మాత్రమే కాదని నా శ్రేయస్సు కోరుకునే వ్యక్తిగా కూడా అని శర్వానంద్ తెలిపాడు.నాకు అంత మంచి ఫ్రెండ్‌ని ఇచ్చిన చిరంజీవిగారికి ధాన్యవాదాలు చెప్తున్నా అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Sharwanand about his best friend Ram Charan ❤️❤️ pic.twitter.com/ogl9gCsp2z
— Royal Charan (@GamechangerRC7) February 9, 2024
ఇదిలా ఉంటే శర్వానంద్ కెరీర్ విషయానికి వస్తే..ఓకే ఒక కథ సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్..గతేడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. 2023 రక్షిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా శర్వానంద్... ప్రస్తుతం దర్శకుల వద్ద కథలు వింటున్నారు. ఈ ఏడాది శర్వానంద్ కొత్త సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందని తెలుస్తోంది












Click it and Unblock the Notifications