తెలుగులో టాప్-3 హీరోలు వీళ్లే.. ఆర్మాక్స్ సర్వే
తెలుగులో అత్యంత ప్రజాదరణ దక్కించుకున్న హీరోలు ఎవరు? అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఆర్మాక్స్ సంస్థ సర్వే నిర్వహిస్తుంటుంది. తాజాగా ఈ ఏడాది కూడా సర్వే నిర్వహించగా వచ్చిన ఫలితాలను ప్రకటించారు. సహజంగానే పాన్ ఇండియా రెబల్ స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ ఈ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. కల్కి సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసిన ప్రభాస్ తన తర్వాత సినిమాలు కూడా పూర్తిచేసి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కు 2
ప్రభాస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. ఇది సెప్టెంబరు 27వ తేదీన విడుదల కాబోతోంది. మూడో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. గుంటూరు కారంతో ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాలుగో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. ఆయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 చేస్తున్నారు. డిసెంబరు ఆరోతేదీన విడుదల కాబోతోంది.

రామ్ చరణ్ కు 5
ఐదో స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచారు. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ ను పూర్తిచేసి బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న చిత్రం షూటింగ్ కు హాజరు కావాల్సి ఉంది. ఆరో స్థానంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిలిచారు. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నారు. ఏడో స్థానంలో నేచురల్ స్టార్ నాని నిలిచారు. తొలిసారిగా ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. ఎనిమిదో స్థానంలో మాస్ మహారాజా రవితేజ నిలిచారు. రవితేజ తర్వాత తొమ్మిదో స్థానంలో మెగాస్టార్ చిరంజీవి, పదో స్థానంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిలిచారు.












Click it and Unblock the Notifications