టాప్-5 బిగ్గెస్ట్ మూవీస్
మనదేశంలో విడుదలైన పాన్ ఇండియా సినిమాలు రూ.1000 కోట్ల మార్క్ ను అందుకోవడం 2016లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తంగా కేవలం ఐదు సినిమాలే ఈ మార్క్ ను అందుకున్నాయి. బాహుబలి2 విడుదలైన భారతదేశంలో సంచలనం సృష్టిస్తున్న సమయంలోనే అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ సినిమా చైనాలో విడుదలైంది. అక్కడ లభించిన కలెక్షన్స్ తో కలిపి సులువుగా రూ.వెయ్యి కోట్ల మార్క్ ను దాటి, బాహుబలి2ను కూడా అధిగమించి సంచలనం సృష్టించింది.
తర్వాత వచ్చిన సినిమాల్లో RRR మూవీ 1000 కోట్ల మార్క్ ని అందుకోగా, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా కూడా ఈ మార్క్ ని అందుకుంది. తాజాగా ఈ ఏడాదిలో పఠాన్ మూవీ బాలీవుడ్ తరుపున రూ. 1000 క్లోట్ల మార్క్ ని చైనా విడుదల లేకుండానే సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించింది. మళ్లీ షారుఖ్ నటించిన జవాన్ చిత్రం ఆల్ టైం రికార్డులతో ఊచకోత కోసేసింది.

ఇండియాలో టాప్-5 బిగ్గెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాలు
దంగల్ - రూ.1958 కోట్లు
బాహుబలి2 - రూ.1810 కోట్లు
RRR - రూ.1290 కోట్లు
కేజీఎఫ్ 2 - రూ.1233 కోట్లు
జవాన్ - రూ.1135 కోట్లు
పఠాన్ - రూ.1051 కోట్లు
మనదేశంలో రూ.వెయ్యి కోట్ల మార్క్ ను అందుకున్న సినిమాలు ఇవే. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన చిత్రాలు కూడా ఇవే. ఇందులో రెండు తెలుగు చిత్రాలు టాప్ ప్లేస్ లో నిలబడటం విశేషం. అలాగే షారుఖ్ నటించిన రెండు సినిమాలు ఊహకందని రీతిలో రికార్డులను నెలకొల్పాయి. డిసెంబరు 22న విడుదలయ్యే సలార్ చిత్రం కూడా ఈ స్థాయిలోనే వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.












Click it and Unblock the Notifications