వారం రోజులకే దుకాణం సర్దేశావా అన్నా..! మళ్లీ నాలుగేళ్లకు దర్శనం..!

రాకింగ్ స్టార్ యష్ గురించి మాట్లాడాలంటే కేజీఎఫ్ సిరీస్ కు ముందు కేజీఎఫ్ సిరీస్ కు తర్వాత అని చెప్పాలి. కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో యష్. కేజీఎఫ్ 2 తో రూ. 1200 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన హీరో యష్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఇటీవల టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఆగస్టు 26న విడుదలైంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. దాంతో ఫస్ట్ డే రోజున రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. టాక్సిక్' చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లను వసూళ్లను సాధించింది. దేశీయంగా చూసుకుంటే రూ.101.10 కోట్ల వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బుక్‌ మై షోలో ఫస్ట్ డేనే దాదాపు 9 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. దాంతో పాన్ ఇండియా రేంజ్ లో యష్ స్టామినా ఏంటో అందరికీ అర్థమైంది.


డిజాస్టర్ టాక్ కారణంగా సెకండ్ రోజు నుంచే టాక్సిక్ మూవీకి కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. ఇక టాక్సిక్ మూవీ ఐదు రోజుల్లో రూ. 200 కోట్ల మార్కును దాటేసింది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్ తర్వాత రోజువారీ వసూళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఐదో రోజు నాటికి ఈ చిత్రం 13,946 షోలలో రన్ అవుతూ వస్తోంది. కానీ కలెక్షన్స్ మాత్రం అంత ఆశాజనకంగా లేవు. దీని ప్రకారం చూస్తే మొదటి రోజు ఉన్న భారీ కలెక్షన్స్ ఆ తర్వాత రోజు నుంచి అదే స్థాయిలో కొనసాగలేదని స్పష్టం అవుతోంది. దీనికితోడు టాక్సిక్ మూవీకి దర్శకత్వం వహించిన గీతూ మోహన్ దాస్‌ పై కూడా సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువయ్యాయి. సినిమా రిలీజ్ కు ముందే యష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ పై కొంత ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఆ విమర్శలు మరింతగా పెరిగాయి.

Toxic 5 day collections more hundreds of crores must it rake in to break even What is the gross

ఇక ఇప్పటివరకూ టాక్సిక్ సినిమాకు కర్ణాటక నుంచి రూ. 64 కోట్ల 45 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. అలాగే తెలుగు రాష్ట్రాల నుండి రూ. 32 కోట్ల గ్రాస్.. తమిళనాడు నుంచి రూ. 11 కోట్ల 75 లక్షలు కాగా కేరళ నుండి రూ. 4 కోట్లు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి రూ. 149 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ నుంచి రూ. 28 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. మొత్తం చూస్తే ఇప్పటివరకూ టాక్సిక్ మూవీకి రూ. 290 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, రూ. 135 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక టాక్సిక్ మూవీలో యష్ సరసన కియారా అడ్వాణీ, నయనతార, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే. నారాయణ, యష్ సంయుక్తంగా రూ. 400 కోట్ల భారీ బడ్జెట్​ తో ఈ మూవీని నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+