Toxic Movie: రుక్మిణి వసంత్‌పై నెటిజన్ల ఫైర్.. ఆ ఒక్క సీన్‌తో పెరిగిన వివాదం!
Toxic Movie: కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్, రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "టాక్సిక్" సినిమాలో కీలక పాత్ర పోషించారు. కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా వంటి భారీ తారాగణం ఉన్న ఈ మల్టీ-స్టారర్ చిత్రంలో రుక్మిణి 'మెలిస్సా' అనే పాత్రలో నటించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత రుక్మిణి వసంత్ నటనకు రావాల్సిన ప్రశంసల కంటే ఆమె నటించిన ఓ వివాదాస్పద సీన్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైరల్ అయిన బోల్డ్ సీన్
ఈ చిత్రంలో ఓ స్పెషల్ సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ సన్నివేశంలో 'మెలిస్సా' పాత్రలో ఉన్న రుక్మిణి వసంత్ నిద్రలేచి కేవలం ఓ దుప్పటి మాత్రమే కప్పుకుని దిగ్భ్రాంతితో చుట్టూ చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు చాలా పద్ధతి గల అమ్మాయిలా, హోమ్లీ పాత్రల్లో కనిపించిన రుక్మిణిని తెరపై ఇంత బోల్డ్ గా, ఇబ్బందికర స్థితిలో చూడటంతో ఫ్యాన్స్ షాకయ్యారు. ఈ క్లిప్ బయటకు రాగానే నెటిజన్లు ఆమె ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

స్క్రిప్ట్ ఎంపికపై ప్రశ్నల వర్షం
ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా రుక్మిణి వసంత్ అభిమానులు ఈ సీన్ చూసి తీవ్ర నిరాశ చెందారు. ఆమె నుంచి ఇలాంటి బోల్డ్ సీన్ ను ఎప్పుడూ ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇలాంటి సీన్ ఉన్న స్క్రిప్ట్‌ను ఎందుకు ఒప్పుకున్నారంటూ ఆమెను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఇది కేవలం నటి తప్పు మాత్రమే కాదని, చిత్ర నిర్మాతల వైఫల్యమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
There is no kissing or love-making scene for #RukminiVasanth in #Toxic. These people are making unnecessary comments like, “We didn’t expect this from you.” It’s all just impression-begging. 💯
— Nithishhhhhhhh🍿 (@nithishyaps) August 26, 2026
Btw, @rukminitweets, you should’ve never done this shitty film.#Yash #ToxicTheMovie pic.twitter.com/nYiMcvZYxy
స్టోరీకి ఇది అవసరమా?
ఈ సీన్ స్టోరీ అవసరమైనట్లు అనిపించలేదని.. పైగా నటి పాత్ర ప్రాధాన్యతను పెంచేలా కూడా లేదని సినిమా ప్రేమికులు భావిస్తున్నారు. పబ్లిసిటీ కోసం డైరెక్టర్ ఇలాంటి సీన్ ను బలవంతంగా చొప్పించినట్లుగా ఉందని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్, విమర్శలు పీక్స్ కు చేరినప్పటికీ.. ఈ వివాదంపై చిత్ర నిర్మాతలు గానీ, నటి రుక్మిణి వసంత్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. అయితే ఈ వివాదంపై చిత్ర బృందం వివరణ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
Rukku Wtf is this??? 🥲💔#rukminivasanth #toxic #yash pic.twitter.com/pGShcsILmc
— Heisenberg💎 (@supes616) August 26, 2026














Click it and Unblock the Notifications