ఒక్క ఛాన్స్... 'త్రిప్తి' పడిందా?

యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్‌గా మొదటి నాలుగు రోజుల్లో రూ.425 కోట్లను వసూలు చేసింది. యానిమల్ రూ.500 కోట్ల క్లబ్ లో చేరడం లాంఛనమే. ఈ సినిమాతో రణబీర్ కపూర్ వైల్డ్ యాక్టింగ్‌కు... రష్మిక ఫర్మామెన్స్‌కు... సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ ముగ్గురే కాకుండా వీరితోపాటు సైలెంట్‌గా పేరు తెచ్చుకుంది ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన త్రిప్తి డిమ్రి.

త్రిప్తి యానిమల్ సినిమాకు 5 సినిమాల్లో కనిపించింది. వీటిల్లో ఏ ఒక్క సినిమా కూడా మంచిపేరు తీసుకురాలేదు. కానీ యానిమల్ లో కనిపించింది కొంచెంసేపే అయినప్పటికీ ఆడియన్స్ మొత్తం ఆమెగురించి మాట్లాడుకునేలా చేసింది. మెయిన్ లీడ్ రష్మికకు పోటీగా తృప్తి ఫర్మామెన్స్ ఉందనే టాక్ వచ్చింది. రణబీర్ తో రొమాన్స్ సీన్స్ లో తృప్తి యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

tripti dimri will act in tollywood movie

గత మూడు రోజుల నుంచి త్రిప్తి ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉంది. త్రిప్తికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కొందరు దర్శక నిర్మాతలు ఇప్పటికే త్రిప్తితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే తెలుగు తెరపై కనిపించడానికి పెద్దగా సమయం కూడా పట్టదు.

tripti dimri will act in tollywood movie

హీరోయిన్ పాత్రలే కాకుండా త్రిప్తితో స్పెషల్ సాంగ్స్ కూడా చేయించే ఆలోచనలో తెలుగు దర్శకులు ఉన్నట్లు తెలుస్తోంది. త్రిప్తి కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తుందా? లేదా... వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుందా అనేది చూడాలి. రష్మిక హీరోయిన్ గా నటించినప్పటికీ రష్మికకు మించిన ఫాలోయింగ్, పేరు త్రిప్తిడిమ్రికి వచ్చాయి. అందుకు ప్రధాన కారణం ఆమె ఫర్మామెన్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+