భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన త్రిష.. ఆస్తుల విలువ ఎంతంటే!
వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. వంటి చిత్రాలలో తెలుగు సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది త్రిష. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో తన విజయ పరంపరను కొనసాగించింది. అలాగే సినిమా ఇండస్ట్రీలో 20 సంవత్సరాల నుంచి హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. దక్షిణాది సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోయిన్ త్రిష.
సినీ ఇండస్ట్రీలో త్రిష మార్క్
40ఏళ్లు పైబడిన త్రిష ఇప్పటికీ సినిమాలలో తనకంటూ ఒక మార్కును సొంతం చేసుకున్నారు. రెండు దశాబ్దాలుగా దక్షిణాది సినిమాలను ఒక ఊపు ఊపుతున్న త్రిష క్రేజ్ ఈరోజుకి ఏమాత్రం తగ్గలేదు. జోడి సినిమాతో 1999లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రిష ఇప్పటివరకు అనేక హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. రెండు దశాబ్దాలుగా తన అందంతో, అద్భుతమైన నటనతో హీరోయిన్లలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని లీడింగ్ స్టార్ గా నిలిచారు.

భారీగా రెమ్యునరేషన్ పెంచిన త్రిష
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పోనియన్ సెల్వం చిత్రంలో త్రిష అందంతోను, నటనతోను అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఆ తర్వాత త్రిష తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారు. దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటించిన త్రిష లియో సినిమాలో సుమారు ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడిచింది.
బ్రాండ్ ఎండార్స్మెంట్ ల ద్వారా త్రిష సంపాదన
త్రిష ప్రతి సంవత్సరం సినిమాల ద్వారానే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రమోషనల్ పోస్టుల ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నారని సమాచారం. ప్రతి సంవత్సరం ఆమె బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రమోషనల్ పోస్టుల ద్వారానే ఏడాదికి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారని తెలుస్తోంది.
త్రిష ఆస్తులు ఇలా
ఇక త్రిష నెట్ వర్త్, ఆస్తుల విషయానికి వస్తే ప్రస్తుతం త్రిష నెట్ వర్త్ 85కోట్ల రూపాయలుగా ఉందని సమాచారం.ఇక త్రిష ఆస్తుల విషయానికి వస్తే చెన్నైలో త్రిష కు దాదాపు 10కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్లోని ఒక విలాసవంతమైన బంగ్లాలో త్రిష నివసిస్తున్నారు. హైదరాబాద్ లోని త్రిష ఇంటి విలువ 6కోట్లు ఉంటుందని అంచనా. త్రిష లగ్జరీ వాహనాలను కొనడంపైన ఎక్కువ మక్కువ చూపిస్తారని తెలుస్తుంది.
త్రిష వద్ద ఉన్న లగ్జరీ వాహనాల శ్రేణి
త్రిష వద్ద 80 లక్షల రూపాయల విలువైన మెర్సిడీస్ బెంజ్ ఎస్ క్లాస్ తో పాటు, 75 లక్షల రూపాయల విలువైన బిఎండబ్ల్యూ ఫైవ్ సిరీస్, 60 లక్షల రూపాయల విలువైన రేంజ్ రోవర్ ఏవోక్, మెర్సిడీస్ బెంజ్ ఈ కూడా ఉన్నాయి. సౌత్ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిమణిగాను, సౌత్ తో పాటు నార్త్ లోను ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ గాను ఉన్న త్రిష 40 పైబడిన వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications