విజయ్‌పై త్రిష హాట్ కామెంట్స్..సైలెంట్ కిల్లర్ అంటూ మనస్సులో మాట
గత కొద్దిరోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించి అనేక కథనాలు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. విజయ్ పుట్టిన రోజు నాడు త్రిష అతనికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ పాటను కూడా యాడ్ చేసి మరీ ఓ వీడియోను షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్‌గా మారింది.
ఈక్రమంలోనే త్రిష ప్రత్యేకంగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రైవేట్ ఫొటో లీక్ చేసిన విషయం తెలిసిందే. పైగా విజయ్ ఇచ్చిన బర్త్ డే పార్టీకి త్రిష కూడా వచ్చారని టాక్ వినిపించింది. ఆ సమయంలో ఆమెకు ఖరీదైన డైమండ్ రింగ్ విజయ్ గిఫ్ట్‌గా ఇచ్చాడనే ప్రచారం జరిగింది.ఇక విజయ్ కోసమే ఆమె ఓ ఐటం సాంగ్‌లో కూడా నటించారు. విజయ్ కోసమని కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఐటం సాంగ్‌లో నటించారామె. తొలుత ఈ సాంగ్‌లో హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు.

కానీ సడన్‌గా శ్రీలీల స్థానంలో త్రిష ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాలో త్రిష, విజయ్ సాంగ్‌పై ఘోరంగా ట్రోల్స్ నడిచాయి. విజువల్‌గా కూడా ఈ సాంగ్ వరస్ట్‌గా ఉందని సినీ అభిమానులు పెదవి విరిచారు. హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి సమయంలో వీరిద్దరు ప్రత్యకంగా ఓ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లారు. దీంతో వీరి రిలేషన్ గురించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
ఈక్రమంలోనే విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరోసారి విజయ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది త్రిష. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...విజయ్ షూటింగ్ సమయంలో చాలా విభిన్నంగా, నిశ్శబ్దంగా ఉంటాడని పేర్కొన్నారు. అందుకే అతడిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారని త్రిష అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications