Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తమిళనాడుకు తదుపరి సీఎం నేనే: త్రిష సంచలన కామెంట్స్ వైరల్..!!

తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. అధికార డీఎంకే పార్టీ మరోసారి గద్దెనెక్కాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే పార్టీ ఈసారి అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ దళపతి టీవీకే పార్టీ అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు విజయ్ చూట్టూనే తిరుగుతున్నాయి.

విజయ్ తొలిసారిగా బరిలోకి దిగుతున్న తరుణంలో అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగత కారణాలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత జన నాయగన్ మూవీ నిరవధిక వాయిదా.. తన మాజీ భార్య సంగీత వ్యవహారం.. ఇలా వరుస సమస్యలు ఆయన్ను చుట్టు ముట్టాయి. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ విజయ్ కు ఇవి సానుకూలంగా మారతాయా..? లేక ప్రతికూలంగా మారతాయా..? అనేది తేలాల్సి ఉంది.

అయితే ఇటీవల విజయ్ భార్య సంగీత.. అతడి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ సమయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. తన భర్త విజయ్.. ఓ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని.. తనకు న్యాయం జరగకపోతే ఆమె ఎవరో బయటపెడతానని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వివాదం కొనసాగుతున్న వేళ విజయ్, నటి త్రిష ఒకే కారులో ప్రత్యక్షం కావడం సంచలనానికి దారితీసింది. చెన్నైలోని ఓ వివాహ కార్యక్రమానికి వీళ్లిద్దరూ జంటగా ఒకే కారులో వచ్చారు. దాంతో విజయ్- త్రిష ప్రేమ వ్యవహారం మరోసారి తమిళ నాట హాట్ టాపిక్ గా మారింది.

Trisha Old Remarks on Tamil Nadu CM Go Viral I Will Be the Next Chief Minister Trisha next CM

మరోవైపు ప్రస్తుతం త్రిషకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. కచ్చితంగా అవుతాను అంది. అందుకు యాంకర్ నవ్వగా.. నేను కామెడీగా మాట్లాడడం లేదు.. నిజంగానే చెప్తున్నాను అని త్రిష అంటుంది. అయితే ఏ ధైర్యంతో ఆమె అలా చెప్పిందో అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే విజయ్ ను చూసుకొనే ఈ మాట చెప్పిందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+