విజయ్‌తో పెళ్లి కోసం ఆలయంలో త్రిష ప్రత్యేక పూజలు..?
హీరోయిన్ త్రిష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది.
అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్య కొత్త సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్‌గా తీసుకున్నారు. 41 ఏళ్ల వచ్చినప్పటికీ తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఇదే సమయంలో తమిళ స్టార్ హీరోతో విజయ్‌తో త్రిష రిలేషన్ కూడా ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది.

వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, విజయ్ బర్త్ డేకు త్రిష విషెష్ చెప్పడం, ఆ తర్వాత విజయ్ కోసం త్రిష తొలిసారి ఐటం సాంగ్ చేయడం అన్నీ కూడా వీరి రిలేషన్‌ను బహిర్గతం చేశాయి. ఇటీవలే వీరిద్దరు కలిసి స్పషల్ ఫ్లైట్‌లో హీరోయిన్ త్రిష పెళ్లికి హాజరవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే త్రిష తాజాగా ఆలయంలో పూజలు నిర్వహించారు. కోయంబత్తూరులోని ప్రసిద్ధిగాంచిన మరుదమలై మురుగన్ ఆలయానికి వెళ్లి స్వామి నేలపై కూర్చుని మరీ పూజలు నిర్వహించారు. త్రిష పూజలు చేయడం చూసిన వారంతా కూడా విజయ్‌తో పెళ్లి కోసమే ఆమె ఇలా చేస్తోందంటూ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం త్రిష పూజలు చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications